News July 30, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TOP HEADLINES
*ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్ కార్యాలయంలో రైతు రుణమాఫీ కార్యక్రమం
*దమ్మపేట వాగులో పడి ఏడేళ్ల బాలుడు మృతి
*దుమ్ముగూడెం ఏజెన్సీలో పర్యటించిన భద్రాద్రి జిల్లా కలెక్టర్
*పార్టీ మార్పు పై క్లారిటీ ఇచ్చిన భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు
*అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై ప్రస్తావించిన ఎమ్మెల్యే రాగమయి
*భద్రాచలం గోదావరి వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక
Similar News
News October 14, 2024
కొత్తగూడెం: తండ్రిని హత్యచేసిన తనయుడు
మద్యానికి బానిసైనా కొడుకు తండ్రిని హతమార్చిన ఘటన దమ్మపేట మండలం వడ్లగూడెంలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. కృష్ణయ్య(70), భార్య మంగమ్మ కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి కొడుడు సత్యనారాయణ మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం మద్యం కోసం కృష్ణయ్య వద్ద డబ్బులు అడగటంతో గొడవ మొదలైంది. కోపోద్రిక్తుడైన కొడుకు తన తండ్రి మెడను కత్తితో కోశాడు. కృష్ణయ్యను ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
News October 14, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} పాల్వంచ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
News October 14, 2024
ఖమ్మం: ఇవాళ, రేపు మంత్రి తుమ్మల పర్యటన
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ, రేపు రెండు రోజులపాటు ఖమ్మం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 14న రఘునాధపాలెం మండలం రజబ్ ఆలీ నగర్, ఎన్వి బంజార, పంగిడి గ్రామాలలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. 15న ఖమ్మం నగరంతో పాటు మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమయి గూడెంలో పర్యటించనున్నట్లు తెలిపారు.