News January 5, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
∆} కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} బూర్గం పహాడ్ మండలంలో ఎమ్మెల్యే పాయం పర్యటన
∆} అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటన

Similar News

News November 28, 2025

ఖమ్మం: ఫిలాటెలీ ఎగ్జిబిషన్-2025 ప్రారంభం

image

ఖమ్మం నగరంలోని DPRC భవనంలో జిల్లా స్థాయి ఫిలాటెలీ (పోస్టల్ స్టాంపుల సేకరణ) ఎగ్జిబిషన్‌ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన రెండు రోజుల పాటు జరుగుతుంది. కలెక్టర్ మాట్లాడుతూ.. అభిరుచులు (హాబీలు), వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం పెరగడానికి దోహదపడతాయని తెలిపారు. ఎగ్జిబిషన్ అనంతరం, కలెక్టర్ పోస్టల్ బీమా పరిహారం చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

News November 28, 2025

ఖమ్మం: 15 మంది నోడల్ అధికారుల నియామకం

image

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను 13 విభాగాలుగా విభజించి 15 మంది నోడల్ అధికారులను నియమించారు. వీరందరికీ గతంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన అనుభవం ఉంది. ఎన్నికల కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు గాను వీరిని నియమిస్తూ ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు 15 మంది ఒక్కో రకమైన బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

News November 28, 2025

ఖమ్మం జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం!

image

ఖమ్మం జిల్లాలో పలు మండలాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉంది. తాజా ఓటర్ల వివరాల ప్రకారం నేలకొండపల్లిలో అత్యధికంగా 2,150 మంది మహిళా ఓటర్లు అదనంగా ఉన్నారు. రఘునాథపాలెం 1,946, కూసుమంచి 1,645, చింతకాని 1,733, ఖమ్మం రూరల్, సత్తుపల్లి, ఏరుపాలెం, తల్లాడ, బోనకల్, పెనుబల్లి, కొణిజర్ల, సింగరేణి వంటి మొత్తం 12 మండలాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే 1,000కి పైగా అధికంగా ఉన్నారు.