News January 8, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ముఖ్యాంశాలు

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} మధిరలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ∆} కరకగూడెంలో ఎమ్మెల్యే పాయం పర్యటన ∆} పెనుబల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇంటి సర్వే
Similar News
News November 3, 2025
ప్రజావాణి అర్జీలను పెండింగ్లో ఉంచొద్దు: అదనపు కలెక్టర్ శ్రీజ

ఖమ్మం కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ పాల్గొని అర్జీలను స్వీకరించారు. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూమి, రహదారి, స్వయం ఉపాధి, జీతం వంటి పలు సమస్యలపై ప్రజలు సమర్పించిన అర్జీలపై తగు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
News November 2, 2025
సెలవులపై వెళ్లిన ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వ్యక్తిగత సెలవులో వెళ్తున్నారు. నేటి నుంచి వారం పాటు ఆయన సెలవులో ఉంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. తిరిగి కలెక్టర్ 10వ తేదీన విధుల్లో చేరతారు. అప్పటి వరకు అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఇన్చార్జి కలెక్టర్ గా వ్యవహరించనున్నారు.
News November 2, 2025
ఖమ్మం: ఈనెల 15న సూపర్ లోక్ అదాలత్

పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 15న సూపర్ లోక్ ఆదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జీ జి.రాజగోపాల్ తెలిపారు. ఖమ్మం జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా సోమవారం నుంచి ఈనెల 15వ తేదీ వరకు చెక్ బౌన్స్ కేసులు, రోడ్డు ప్రమాద బీమా కేసులు, రాజీ పడదగిన సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు.


