News September 26, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ముఖ్యంశాలు

☆ మధిరలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
☆ సాగర్ ఆయకట్టు భూములకు సాగునీరు అందిస్తాం: కలెక్టర్
☆ పర్యాటక గుమ్మంగా ఖమ్మం ఖిల్లాను తీర్చిదిద్దుతాం: తుమ్మల
☆ ఓపెన్ పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేయాలి: అదనపు కలెక్టర్
☆ ఘనంగా ఐలమ్మ జయంతి కార్యక్రమం
☆ సత్తుపల్లిలో బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడిపై పోక్సో కేసు నమోదు
☆ కరకగూడెంలో పురుగుల మందు తాగి బాలిక ఆత్మహత్య
☆ సుజాతనగర్లో గంజాయి పొట్లాలు స్వాధీనం
Similar News
News December 6, 2025
పాలేరు జలాశయంలో మత్స్యకారుడు మృతి

కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో చేపల వేటకు వెళ్లి ఎర్రగడ్డ తండాకు చెందిన బానోత్ వాల్య(65)అనే మత్స్యకారుడు మృతి చెందాడు. తండావాసుల కథనం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన వాల్యకు చేపల వలలు కాళ్లకు చుట్టుకుని నీటిలో మునిగి పోయాడు. ఈరోజు ఉదయం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.
News December 6, 2025
ఖమ్మం: ఎన్నికలు.. రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి

ఖమ్మం జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ను పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సమక్షంలో పూర్తి చేశారు. కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు. 192 గ్రామ పంచాయతీలకు, 1740 వార్డులకు గాను 1582 బృందాలు సిద్ధమయ్యాయి. నిబంధనల ప్రకారం 20% సిబ్బందిని రిజర్వ్లో ఉంచారు.
News December 6, 2025
రెండో విడత ఎన్నికలు.. నేడు గుర్తులు కేటాయింపు.!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులకు ఆయా కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులు ఈరోజు గుర్తులు కేటాయించనున్నారు. అటు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. ఇప్పటికే రెబల్స్ బరిలో నిలిచిన అభ్యర్థులను ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లను విత్ డ్రా చేయించే పనిలో నిమగమయ్యారు. కాగా గుర్తుల కేటాయింపు అనంతరం ఎన్నికల ప్రచారం ముమ్మరం కానుంది.


