News July 21, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు విద్యుత్ శాఖ హెచ్చరిక

image

విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు జిల్లా విద్యుత్ శాఖ అధికారులు పలు సూచనలు చేశారు. తడిసిన కరెంట్ స్థంబాలను, విద్యుత్ లైన్‌కు తగిలే చెట్లను, తడి చేతులతో చార్జింగ్ పెట్టడం, స్విచ్ ఆన్ చేయడం వంటివి చేయవద్దని హెచ్చరించారు. అలాగే ఉతికిన బట్టలు ఇనుప తీగలపై ఆరవేయొద్దని సూచించారు. ఏమైనా విద్యుత్ సమస్య వస్తే సొంతంగా రిపేర్ చేయకుండా, విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు.

Similar News

News December 3, 2025

పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం: ఖమ్మం సీపీ

image

దట్టమైన పొగమంచు సమయాల్లో వాహన ప్రయాణం ప్రమాదకరమని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు నివారించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారని, పొగమంచు కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్టిలో పెట్టుకొని స్వల్ప నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

News December 3, 2025

పాలేరు జలాశయం ప్రస్తుత నీటిమట్టం 20.5 అడుగులు

image

కూసుమంచి మండలం పాలేరు జలాశయం ప్రస్తుత నీటిమట్టం 20.5 అడుగులకు చేరింది. ఈ సందర్బంగా జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 20.5 అడుగులుగా ఉంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి జలాశయానికి నీటి విడుదల కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం నుంచి కింది కాల్వకు, తాగునీటికి నీటిని వినియోగిస్తున్నారు.

News December 3, 2025

ఖమ్మం: అర్ధరాత్రి పొద్దుపోయేంతవరకు నామినేషన్లు

image

ఖమ్మం జిల్లాలో రెండో విడత నామినేషన్ల దాఖలు పూర్తయ్యాయి. అర్ధరాత్రి పొద్దుపోయేంతవరకు నామినేషన్లు దాఖలు చేశారు. 6 మండలాల్లో మొత్తం 183 గ్రామపంచాయతీలకు గాను 1055 నామినేషన్లు దాఖలయ్యాయి. అదే విధంగా 1686 వార్డులకు గాను 4160 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కూసుమంచి మండలంలో అత్యధికంగా సర్పంచ్ పదవికి 250 మంది నామినేషన్లు దాఖలు చేయడం విశేషం.