News December 27, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లా హెడ్ లైన్స్
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన రద్దు ∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం, కొత్తగూడెం కలెక్టర్ల సమీక్ష ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} మణుగూరులో మంచినీటి సరఫరా బంద్ ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
Similar News
News December 29, 2024
KMM: పత్తి చేనులో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మధిర మండలంలో ఈరోజు తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా… మధిర మండలం దెందుకూరు గ్రామ సమీపంలో పత్తి చేనులో వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చారు. అవి తగిలి చర్చి ఫాదర్ మీసాల శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News December 29, 2024
ఖమ్మం: సైబర్ నేరస్థుల వలలో చిక్కకండి: సీపీ సునీల్ దత్
ఖమ్మం ప్రజలకు సీపీ సునీల్ దత్ పలు సూచనలు చేశారు. సైబర్ నేరగాళ్ల మోసాలు అధికంగా పెరిగిపోయాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగితే పంపి మోసపోవద్దన్నారు. ఎవరైనా డబ్బులు పంపాలని ఫోన్ చేస్తే వెంటనే 1930ను సంప్రదించాలని సీపీ కోరారు.
News December 28, 2024
KMM: ఉత్సాహంగా ప్రారంభమైన సీపీఐ శతాబ్ది ఉత్సవాలు
సీపీఐ శత వసంతాల ఉత్సవాలు శుక్రవారం మణుగూరు పట్టణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా రామానుజవరంలో అమరుల స్థూపాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆవిష్కరించారు. అనంతరం స్థానిక పాత బస్టాండ్ నుంచి ఆదర్శ్ నగర్ వరకు భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు.దీంతో ఎర్రజెండాలతో మణుగూరు వీధులు ఎరుపెక్కాయి. మహిళలంతా ఎర్రజెండాలను చేతపట్టి నడిచారు. సభా వేదికపై కళాకారులు నృత్య ప్రదర్శన చేసి అలరించారు.