News July 16, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాకు కొత్త బస్సులు

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో RTCకి కొత్త బస్సులు కేటాయించడంతో ఆయా మార్గాల్లో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందనున్నాయి. కొన్నాళ్లుగా డొక్కు బస్సులతో ఇబ్బందిపడిన ప్రయాణికులకు కొత్త బస్సుల రాకతో ఊరట కలగనుంది. ఉమ్మడి జిల్లాకు RTC సొంత బస్సులు, అద్దె బస్సులు కలిసి 130 వరకు కొత్తవి సమకూరనున్నాయి. ఇప్పటికే 30 బస్సులు ఆయా డిపోలకు రాగా మిగిలినవి నెల నుంచి 2 నెలల వ్యవధిలో తీసుకురానున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Similar News

News October 12, 2024

తుళ్లూరులో మద్యం దుకాణాలకు భారీ డిమాండ్

image

ఏపీలో మద్యం దుకాణాల అనుమతికి గుంటూరు, NTR జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. గుంటూరు జిల్లాలో 127 దుకాణాలకు 4,396 దరఖాస్తులు అందాయి. తొలి 10అత్యధిక దరఖాస్తుల్లో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నుంచే 8 ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు (104)దుకాణానికి 95దరఖాస్తులు, తుళ్లూరు (102) షాపునకు 86దరఖాస్తులు, తుళ్లూరు(103)దుకాణానికి 82 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

News October 12, 2024

గుంటూరు: డిగ్రీ పరీక్షల టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో బీకామ్ జనరల్ & కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్స్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 23 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని, 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 24 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News October 11, 2024

జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

జిల్లా ప్రజలకు కలెక్టర్ అరుణ్ బాబు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకొంటారని ఆయన పేర్కొన్నారు. దసరా పండుగ జిల్లా ప్రజలందరికీ మేలు చేయాలని, జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.