News October 13, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలలో బైక్ అంబులెన్స్ సేవలు ప్రారంభం: ఎస్పీ

image

దీర్ఘాయుష్మాన్ బైక్ అంబులెన్స్‌ను ఎస్పీ కంచి శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. క్షతగాత్రులు బైక్ అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే డాక్టర్ లేదా నర్స్ ప్రమాద స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స చేసి అనంతరం ఆసుపత్రికి పంపిస్తారన్నారు. బైక్ అంబులెన్స్ సేవలు నేటి నుంచి ఉమ్మడి జిల్లాలలో 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు. బైక్ అంబులెన్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ 8340000108, 8186000108నంబర్లు ఇవే.

Similar News

News November 3, 2024

హంతకులకు కొమ్ము కాస్తున్నారు : అంబటి

image

చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో బాలిక శైలజ మృతి బాధాకరమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బాలిక హత్య జరిగి నాలుగు నెలలు దాటిన ప్రభుత్వం చేపట్టిన చర్యలు శూన్యమన్నారు. వైసీపీ తరఫున మాజీ సీఎం జగన్ బాలిక కుటుంబానికి రూ.10లక్షలు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు అనేకం జరుగుతున్నా.. ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి హంతకులకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు.

News November 2, 2024

మాచర్ల: ఇంజినీరింగ్ విద్యార్థి సూసైడ్

image

మాచర్లలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థి తన రూమ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దీంతో సహచర విద్యార్థులు ఒక్కసారిగా కంగారుపడ్డారు. ఇప్పటి వరకు తనతో పాటూ ఉన్న స్నేహితుడు చనిపోవడంపై కన్నీటి పర్యంతమయ్యారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.

News November 2, 2024

అమరావతి: ఇద్దరు యువకులు మృతి

image

అమరావతి మండలం దిడుగులో శనివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఐదుగురు యువకులు కృష్ణా నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయారన్నారు. గమనించిన స్థానికులు ముగ్గురి యువకులను కాపాడగా, మరో ఇద్దరు యువకులు మృతి చెందినట్లు తెలిపారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.