News April 18, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురి నామినేషన్

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో గురువారం అసెంబ్లీ స్థానానికి పలువురు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ తరఫున నరసరావుపేట-చదలవాడ అరవిందబాబు, మంగళగిరి- నారా లోకేశ్ ఉన్నారు. వైసీపీ తరఫున బాపట్ల- కోన రఘుపతి ఉన్నారు. పిరమిడ్ పార్టీ వినుకొండ-రమణ, పెదకూరపాడు-మల్లిఖార్జున రావు, కాంగ్రెస్ తరఫున-నాగేశ్వరరావు, జాతీయ జనసేన పార్టీ నరసరావుపేట-గోదా రమేశ్, టీడీపీ నరసరావుపేట ఎంపీగా శ్రీకృష్ణ దేవరాయలు.

Similar News

News December 9, 2025

విద్యార్థుల గళంపై కూటమి ఉక్కుపాదం మోపుతుంది: YCP

image

విద్యార్థుల గళంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని YCP ‘X’లో పోస్ట్ చేసింది. YCP స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని నిరసన తెలిపినందుకు చైతన్యపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారని రాసుకొచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అడిగితే కేసులా చంద్రబాబు, లోకేశ్ అంటూ ప్రశ్నించారు.

News December 9, 2025

దివ్యాంగులకు ఇళ్లు.. జాబితాను సిద్దం చేయాలి: కలెక్టర్

image

దివ్యాంగులకు గృహాల మంజూరుకు అర్హుల జాబితా సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. దివ్యాంగుల గృహాల అంశం పై కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్ సమీక్షించారు. ఆధార్ చిరునామా, జాబ్ కార్డు తదితర వివరాలను పరిశీలించాలన్నారు. అవసరమైతే ఆధార్ చిరునామా మార్పు చేయాల్సి ఉంటుందని, అందుకు వారి సంసిద్ధతను తెలుసుకోవాలన్నారు. జిల్లాకు చెందిన వారిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

News December 9, 2025

మంగళగిరి: సీకే హైస్కూల్ ఈసారైనా రాణిస్తుందా?

image

మంగళగిరిలో ఏళ్ల చరిత్ర కలిగిన CKహైస్కూల్ విద్యార్థులు ఈసారైనా టెన్త్ ఫలితాల్లో రాణిస్తారా అనేది వేచి చూడాలి. గతంలో ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి మార్కులతో సత్తా చాటేవారు. కొన్నేళ్లుగా ర్యాంకుల సంగతి అటుంచితే ఉత్తీర్ణత శాతమే భారీగా పడిపోతూ వస్తోంది. ప్రస్తుతం విద్యాశాఖ అమలు చేస్తున్న 100రోజుల ప్రణాళికను టీచర్లు పటిష్ఠంగా అమలు చేసి మంచి ఫలితాలు రాబట్టాలని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.