News June 14, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1080 డీఎస్సీ పోస్టులు

image

మెగా డీఎస్సీ పేరుతో నూతన సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేస్తానని చేసిన వాగ్దానం మేరకు గురువారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలో రాష్ట్రం మొత్తం 16,347 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదలకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీలను అధికారికంగా ప్రకటించకపోయినా విశ్వసనీయ సమాచారం మేరకు ఉమ్మడి జిల్లాలో దాదాపు 1080 ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

Similar News

News September 18, 2024

గుంటూరులో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలు

image

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాలు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, ఎన్టీఆర్ స్టేడియంలలో జరిగాయి. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ నాగలక్ష్మి , గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నసీర్, గళ్ళా మాధవి, నగరపాలక సంస్థ కమీషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు.

News September 18, 2024

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10లక్షల విరాళం

image

వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10ల‌క్ష‌ల విరాళాన్ని మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత అందజేశారు. ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌తో కలిసి చంద్రబాబును కలిసి చెక్కు అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు వచ్చిన వారిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు.

News September 18, 2024

GNT: దెబ్బతిన్న పంటలపై పెమ్మసాని దృష్టి సారింపు

image

గుంటూరు జిల్లాలో దెబ్బతిన్న పంట పొలాలు, గండిపడ్డ డ్రైన్లు, వాగులు, గుంటూరు ఛానల్ పరివాహక ప్రాంతాలపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక దృష్టి సారించారు. మరోసారి ఇలాంటి వరద నష్టం జరగకుండా అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. రూ.808 కోట్ల ప్రతిపాదనలతో కూడిన అంచనాలతో గుంటూరు ఛానల్ అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై తొలి అడుగు వేశారు. ఈ మేరకు గుంటూరులో స్పెషల్ ఆఫీసర్ కృష్ణమ నాయుడు పర్యటించారు.