News April 15, 2025
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 249 పోస్టులు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 249 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టుల మంజూరుకు మంగళవారం జీవో విడుదలైంది. వీటిలో ఉమ్మడి జిల్లాకు 151 SGT(ప్రాథమిక స్థాయి), 98 స్కూల్ అసిస్టెంట్ల(ద్వితీయ స్థాయి) పోస్టులు మంజూరయ్యాయి. ఈ పోస్టులను ఇప్పటికే ఉన్న సర్ప్లస్ ఉపాధ్యాయ పోస్టులను మార్చి రూపొందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Similar News
News December 2, 2025
చంద్రబాబు కేసులను మూసివేయిస్తున్నారు: MLC బొత్స

AP: తనపై ఉన్న అవినీతి కేసులను మూసివేయించేందుకు CM <<18441609>>చంద్రబాబు<<>> అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని YCP MLC బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఫిర్యాదుదారులను బెదిరించి కేసులను ఉపసంహరించుకునేలా చేస్తున్నారని విమర్శించారు. “స్కిల్, అసైన్డ్ ల్యాండ్స్, రింగ్రోడ్, ఫైబర్నెట్, లిక్కర్ సహా పలు కేసులు ఉన్నప్పటికీ.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిలో పురోగతి లేదు. గవర్నర్ చర్యలు తీసుకోవాలి” అని కోరారు.
News December 2, 2025
కేయూలో నాన్ బోర్డర్లకు నిషేధం

కేయూ క్యాంపస్లో నాన్ బోర్డర్ల ప్రవేశాన్ని నిలిపివేస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. క్యాంపస్లో శాంతి, భద్రత కోసం కొత్త మార్గదర్శకాలు ప్రకటించారు. పుట్టిన రోజులు సహా వ్యక్తిగత వేడుకలు, రాత్రి 9 తర్వాత ఫుట్పాత్లు-బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడడాన్ని నిషేధించారు. నాన్ బోర్డర్లు వారం రోజుల్లో హాస్టల్స్ ఖాళీ చేయాలని, బోర్డర్లు తప్పనిసరిగా ఐడీ కార్డు కలిగి ఉండాలన్నారు.
News December 2, 2025
కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. రామలక్ష్మణపల్లి 12.8°C, డోంగ్లి 13, గాంధారి 13.1, నస్రుల్లాబాద్ 13.2, జుక్కల్, బీబీపేట్, మేనూర్, బీర్కూర్ 13.3, బొమ్మన్ దేవిపల్లి 13.5, పెద్ద కొడప్గల్,సర్వాపూర్, పుల్కల్ 13.7, బిచ్కుంద 14, రామారెడ్డి 14.2, లచ్చపేట 14.4, మాక్దూంపూర్ 14.5, పిట్లం 14.6°C.


