News May 21, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎవరిది ఆధిపత్యం?

image

జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాల కోసం గుంటూరు జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 MP స్థానాలున్నాయి. మహిళల ఓటింగ్ పెరిగిందని, వారంతా YCPకే ఓటు వేశారని మంత్రి అంబటి, తదితర నేతలు ప్రకటించారు. మరోవైపు, మెజార్టీ స్థానాలు తమవే అని యరపతినేని, ప్రత్తిపాటి పుల్లారావు, తదితరులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీది ఆధిపత్యం ఉంటుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Similar News

News December 4, 2024

పల్నాటి మహా వీరుడు.. మాల కన్నమదాసు

image

11వ శతాబ్దంలో మహాభారతాన్ని తలపించిన పల్నాటి యుద్ధం ఓ మహావీరుని విజయానికి ప్రతీక అని చరిత్ర చెబుతుంది. అతడే మాచర్ల రాజ్యానికి సర్వసైన్యాధ్యక్షుడు.. అతి వీర భయంకరుడు ‘మాల కన్నమదాసు’. బ్రహ్మనాయుడి దత్తపుత్రునిగా రాజాజ్ఞను పాటిస్తూ సైన్యాన్ని నడిపించి బ్రహ్మన్న సహకారంతో నాగమ్మను ఓడించి మాచర్లకు విజయాన్ని చేకూర్చాడని చరిత్రలో లిఖించబడింది. యుద్ధంలో కన్నమదాసు వాడిన భైరవ ఖడ్గం నేటికీ పూజలందుకోవడం విశేషం.

News December 4, 2024

అమరావతి ప్రాంతంలో కంపించిన భూమి

image

గుంటూరు జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు, పరిసర ప్రాంతాలతో పాటు గుంటూరు జిల్లాలో పలుచోట్ల నాలుగు సెకన్ల పాటు రెండుసార్లు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మీ ప్రాంతంలో ఎక్కడైనా కంపించిందా కామెంట్ చేయండి.

News December 4, 2024

డ్రోన్ల వినియోగం విస్తృతం చేయండి: సీఎం 

image

అమరావతి: భద్రత, నేర నియంత్రణ, ప్రజా సేవలకు డ్రోన్ల వినియోగాన్ని విస్తృతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలో డ్రోన్ డెమోను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిర్వహణ, రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాలకు మందుల పంపిణీ, పారిశుద్ధ్య చర్యల కోసం డ్రోన్లను వినియోగించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను కోరారు.