News December 2, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో HIV రోగులు ఎంత మంది అంటే?

image

అధికారిక గణాంకాల ప్రకారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో HIV రోగులు భారీగా ఉన్నారు. గుంటూరులో 16,630, పల్నాడులో 17,536, బాపట్లలో 11,356 మంది HIV రోగులుండగా, 2023లో అత్యల్ప సంఖ్యలో కొత్తగా వైరస్ సోకిన జిల్లాలో గుంటూరు ఉంది. కాగా HIV రోగులకు ప్రతి నెలా రూ.4,000 పింఛన్ ఇస్తున్నట్లు AP స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(ఏపీ శాక్స్) అధికారులు తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో 42,924 మందికి ఈ పింఛన్ అందుతుంది.

Similar News

News February 27, 2026

వీధి కుక్కల నియంత్రణపై చర్యలు చేపట్టాలి: GNT కలెక్టర్

image

వీధి కుక్కలపై ప్రజల నుంచి అధికంగా ఫిర్యాదులు అందుతున్నాయని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. పరిష్కరించేందుకు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వీధి కుక్కల నియంత్రణపై గురువారం సమావేశం నిర్వహించారు. వీధి కుక్కల వలన చిన్న పిల్లలు ఆడుకోవాలన్నా భయపడుతున్నారని, పగలు, రాత్రి తేడా లేకుండా శునకాలు ప్రజలపై దాడి చేస్తున్నాయని వాటి నుంచి రక్షణ కల్పించాలని చెప్పారు.

News February 26, 2026

జిల్లాలో 20 కేంద్రాల్లో NEETపరీక్షలు: GNT కలెక్టర్

image

గుంటూరు జిల్లాలో 20 కేంద్రాల్లో NEETపరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. మే 3న నిర్వహించే నీట్ పరీక్షకు జిల్లాలో గుంటూరు, తెనాలి, మంగళగిరి, అమరావతిలో 20 కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. గురువారం న్యూ ఢిల్లీ నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు.