News October 6, 2024
ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల ఖాతాల్లో రూ.84.97కోట్లు

పీఎం కిసాన్ పథకం కింద ఉమ్మడి గుంటూరు జిల్లాకు రూ.84.97కోట్లు వచ్చాయి. ఈ మేరకు సదరు నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం నేరుగా రైతుల ఖాతాలకు జమ చేశారు. ఈ పథకం కింద గుంటూరు జిల్లాలోని 86,674 మంది రైతులకు రూ.17.33కోట్లు, పల్నాడు జిల్లాలో1,97,639 మంది రైతులకు రూ.39.53కోట్లు, బాపట్ల జిల్లాలో1,40,559 మంది రైతులకు రూ.28.11కోట్లు చొప్పున కేంద్రం జమ చేసింది.
Similar News
News October 31, 2025
నిన్నటి దాకా తుఫాన్.. ఇప్పుడు కృష్ణా నదికి వరద

నిన్నటివరకు తుఫాన్ కష్టాలు ఎదుర్కొన్న ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు ఇప్పుడు వరదల నేపథ్యంలో భయాందోళనలో ఉన్నారు. ప్రకాశం బరేజ్కు భారీగా నీటి ప్రవాహం చేరడంతో కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు ఆందోళనలో గురవుతున్నారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో ఇప్పటికే పంటలు దెబ్బతినగా, ఇప్పుడు కృష్ణా నదికి వరద పెరగడంతో, ఈసారి పంట పరిస్థితి ఎలా ఉండబోతుందో అని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
News October 31, 2025
GNT: వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తుపాన్ సమస్యలపై ఆరా

తుపాన్ కారణంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ యాప్ను సైతం ఉపయోగిస్తోంది. యాప్ ద్వారా సంక్షిప్త సందేశాలను ప్రజలకు పంపిస్తోంది. తుపాను కారణంగా మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలంటూ సందేశాలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజల ఇబ్బందులను తెలుసుకుని సత్వరమే వాటిని పరిష్కరించేందుకు ఈ విధానం దోహదపడుతుందని భావిస్తున్నారు.
News October 30, 2025
ప్రకాశం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ

ప్రకాశం బ్యారేజ్కి వరద ఉద్ధృతి పెరుగుతుంది. గురువారం సాయంత్రం 7గంటలకు వరద 5.66 లక్షల క్యూసెక్యులకు చేరడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. బ్యారేజ్ నీటిమట్టం 15 అడుగులకు చేరింది. అధికారులు అన్ని గేట్లు ఎత్తి 5.66 లక్షల క్యూసెక్యుల నీటిని దిగువకు వదిలారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


