News January 28, 2025
ఉమ్మడి గురుకులాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతి, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 9వ తరగతి, TGSERIS అలుగునూరు COEలలో 9వ తరగతి,TGSERIS ఖమ్మం, పరిగి SOE లలో 8వ తరగతి,TGSERIS రుక్మాపూర్ సైనిక్ స్కూల్, మల్కాజ్ గిరి ఫైన్స్ ఆర్ట్స్ స్కూల్‌లలో 6వ తరగతి ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 01వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ తెలిపారు.
Similar News
News November 7, 2025
MP అర్వింద్ ధర్మపురి ఘాటు వ్యాఖ్యలు

గత BRS ప్రభుత్వంపై నిజామాబాద్ MPఅర్వింద్ ధర్మపురి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ KCR తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారని ఆరోపించారు. KCR కుటుంబం చేసిన పాపానికి CM రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం రేవంత్ చేస్తున్న అతిపెద్ద పాపమని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ పాపం రేవంత్ రెడ్డికి కచ్చితంగా చుట్టుకుంటుందని పేర్కొన్నారు.
News November 7, 2025
HYD: వీళ్లేం సెలబ్రెటీలు: సీపీ సజ్జనార్

అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారని రైనా, ధవన్‌ను ఉద్దేశించి Xలో సీపీ సజ్జనార్ ట్వీట్ చేశారు. బెట్టింగ్ యాప్స్‌కు వ్యసనపరులై వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడటానికి వీరు బాధ్యులు కారా అని ప్రశ్నించారు. ‘సమాజం, యువత మేలు కోసం నాలుగు మంచి మాటలు చెప్పండి. అంతేకానీ అభిమానులను తప్పుదోవపట్టించి వారి ప్రాణాలను తీయకండి’ అని రాసుకొచ్చారు.
News November 7, 2025
వందేమాతరం గీతం దేశభక్తి స్ఫూర్తికి ప్రతీక: ఎస్పీ

కాకినాడ: స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణగా నిలిచిన ‘వందేమాతరం’ గీతం రచనకు ఈ రోజుతో 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాకినాడలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వందేమాతరం గీత రచయిత బంకించంద్ర చటర్జీ, భారతమాత చిత్రపటాలకి ఎస్పీ, పోలీస్ అధికారులు పుష్పాంజలి సమర్పించారు. వందేమాతరం గీతం దేశభక్తి స్ఫూర్తికి ప్రతీక అని వారు అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు.


