News April 15, 2025

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 199 పోస్టులు

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 199 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టుల మంజూరుకు మంగళవారం జీవో విడుదలైంది. వీటిలో ఉమ్మడి జిల్లాకు 117 SGT(ప్రాథమిక స్థాయి), 82 స్కూల్ అసిస్టెంట్ల(ద్వితీయ స్థాయి) పోస్టులు మంజూరయ్యాయి. ఈ పోస్టులను ఇప్పటికే ఉన్న సర్ప్లస్ ఉపాధ్యాయ పోస్టులను మార్చి రూపొందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Similar News

News February 24, 2026

హన్మకొండలో 1,104 మంది టీబీ రోగులు

image

హన్మకొండ జిల్లాలో 1,104 మందికి టీబీ ఉన్నట్లుగా గుర్తించినట్లు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ హిమబిందు బుధవారం తెలిపారు. క్షయ వ్యాధి నిర్ధారణ కోసం జిల్లాలో వైద్య శిబిరాలు నిర్వహించమన్నారు. 60 ఏళ్లు పైబడిన వారు, హెచ్ఐవీ ఎయిడ్స్ ఉన్నవారు, డయాబెటిస్ రోగులు, టీబీ కాంటాక్ట్ ఉన్న 1,93,935 మందికి పరీక్షలు చేశామని, 73,711 మందికి ఎక్స్‌రేలు తీయగా 1,104 మంది టీబీ రోగులను గుర్తించినట్లు తెలిపారు.

News February 24, 2026

విజయవాడలో లూజ్ మిల్క్.. అధికారుల దాడులు

image

రాజమండ్రిలో ఇటీవల జరిగిన దుర్ఘటన దృష్ట్యా NTR కలెక్టర్ ల‌క్ష్మీశ ఆదేశానుసారం విజయవాడలో లూజ్ మిల్క్‌ను విక్రయిస్తున్న వివిధ అవుట్ లెట్స్‌పై అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. కృష్ణ‌లంక‌, పంట‌కాలువ రోడ్డు, గురునాన‌క్ కాల‌నీ త‌దిత‌ర ప్రాంత‌ల్లో త‌నిఖీలు చేసి శాంపిల్స్ సేకరించారు. పాల కల్తీపై అనుమానం వస్తే ఫుడ్ సేఫ్టీ లేదా పశుసంవర్ధక శాఖకు సమాచారం అందించాలన్నారు.

News February 24, 2026

పెద్దపల్లి: ‘ఫీల్డ్ వెరిఫికేషన్ యాప్ పై అవగాహన’

image

మీసేవ ఫీల్డ్ వెరిఫికేషన్ యాప్‌పై సిబ్బంది సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టరేట్ ఏవో ప్రకాష్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో జిపిఓ, ఆర్‌ఐలకు యాప్ వినియోగంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం యాప్‌లోకి వచ్చిన దరఖాస్తులను డిస్పోజ్ చేయాలన్నారు. త్వరలోనే ఈ యాప్ ద్వారా ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు.