News April 16, 2025
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 199 పోస్టులు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 199 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టుల మంజూరుకు మంగళవారం జీవో విడుదలైంది. వీటిలో ఉమ్మడి జిల్లాకు 117 SGT(ప్రాథమిక స్థాయి), 82 స్కూల్ అసిస్టెంట్ల(ద్వితీయ స్థాయి) పోస్టులు మంజూరయ్యాయి. ఈ పోస్టులను ఇప్పటికే ఉన్న సర్ప్లస్ ఉపాధ్యాయ పోస్టులను మార్చి రూపొందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Similar News
News October 31, 2025
నెల్లూరు: ఇండోసోల్ అంశంపై హైకోర్ట్ మొట్టికాయలు

ఇండోసోల్ పరిశ్రమకు చెరువుల్లోని మంచినీటిని ఎలా ఇస్తారంటూ హైకోర్టు ధర్మాసనం శుక్రవారం ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా చెరువుల్లోని తాగునీటిని ఇండోసోల్ పరిశ్రమకు తరలిస్తున్నారంటూ గుడ్లూరు(M) చేవూరు, కావలి(M) చెన్నాయపాలెం ప్రజలు హైకోర్టులో పిల్ వేశారు. దానిపై విచారించిన ధర్మాసనం సమగ్ర నివేదిక ఇవ్వాలని నెల్లూరు(D) కలెక్టర్ను ఆదేశించింది.
News October 31, 2025
CSల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

వీధికుక్కల కేసులో అధికారుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా రాష్ట్రాల CSలు సోమవారం ఫిజికల్గా హాజరు కావాలని ఆదేశించింది. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. వర్చువల్ హాజరుకు అనుమతించాలని SG కోరగా తిరస్కరించింది. GOVT, MNPలు పరిష్కరించాల్సిన అంశాలపై కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడింది. TG, DL, WB మినహా ఇతరులు అఫిడవిట్లు ఎందుకు వేయలేదో సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది.
News October 31, 2025
MHBD: బతికున్న వ్యక్తి మార్చురీకి.. ఎమ్మెల్యే హెచ్చరిక

బతికున్న వ్యక్తిని మార్చురీకి తరలించిన ఘటన నేపథ్యంలో జిల్లా ఆస్పత్రి సిబ్బందిపై మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆసుపత్రికి చేరుకుని బాధితుడు రాజును పరామర్శించారు. ప్రభుత్వ వైద్యం కోసం ఎంతో కృషి చేస్తుంటే, కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, ఇలాంటివి సహించేది లేదని సిబ్బందిని ఎమ్మెల్యే హెచ్చరించారు.


