News April 2, 2024

ఉమ్మడి చిత్తూరు జిల్లా కాంగ్రెస్ MLA అభ్యర్థులు వీళ్లే..

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలువురు MLA అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. * తంబళ్లపల్లి- చంద్రశేఖర్ రెడ్డి * పీలేరు- సోమశేఖర్ రెడ్డి * మదనపల్లె-పవర్ కుమార్ రెడ్డి * పుంగనూరు- మురళీమోహన్ యాదవ్ * చంద్రగిరి- కనుపర్తి శ్రీనివాసులు * శ్రీకాళహస్తి- రాజేశ్ నాయుడు * సత్యవేడు (SC) – బాలగురువం బాబు * నగరి- పి రాకేశ్ రెడ్డి * చిత్తూరు- తికరామ్ * పలమనేరు- శివశంకర్ *
కుప్పం- ఆవుల గోవిందరాజులు

Similar News

News November 14, 2025

అప్పినపల్లి వాసులకు పవన్ ప్రశంస

image

పెద్దపంజాణి(M) <<18282463>>అప్పినపల్లి<<>> వద్ద గ్రామస్థులు ఎర్రచందనం వాహనాన్ని అధికారులకు పట్టించిన సంగతి తెలిసిందే. దీనిపై Dy.CM పవన్ X వేదికగా స్పందించారు. ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్టకు తీసుకుంటున్న చర్చలు ఫలిస్తున్నాయన్న ఆయన ఇందుకు సహకరించిన గ్రామస్థులను ఎక్స్ వేదికగా అభినందించారు. వారి చొరవ, ధైర్యాన్ని పవన్ మెచ్చుకున్నారు.

News November 14, 2025

ప్రజలకు రక్షణ కల్పించడమే లక్ష్యం: SP

image

ప్రజలకు రక్షణ కల్పించడమే పోలీసు శాఖ ధృడ సంకల్పమని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. చిత్తూరులోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. సీసీ కెమెరాల నియంత్రణ, ట్రాఫిక్ మానిటరింగ్ వ్యవస్థ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ మెకానిజం వంటి అంశాలను పరిశీలించారు. డయల్ 112 విభాగాన్ని తనిఖీ చేశారు. సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి కాల్ ఎంతో ముఖ్య ఉంటుందని చెప్పారు.

News November 14, 2025

సోమల: ట్రాక్టర్ కిందపడి కూలి మృతి

image

దుక్కులు దున్నుతూ ట్రాక్టర్ కింద పడి కూలి మృతి చెందిన ఘటన సోమల మండలంలో జరిగింది. ఎస్ఐ శివశంకర్ కథనం మేరకు.. బోనమందకు చెందిన రామచంద్ర (43) మామిడి తోటలో కూలిగా పని చేస్తున్నాడు. తోటలో ట్రాక్టర్ దుక్కులు దున్నుతుండగా డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. ప్రమాదవశాత్తు గుంతలో దిగి ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్ కింద పడడంతో రామచంద్ర మృతి చెందాడు. డ్రైవర్ దూకి వేయడంతో అతనికి ప్రమాదం తప్పింది.