News August 30, 2024
ఉమ్మడి జిల్లాకు ప్రత్యేకాధికారుల నియామకం
ఉమ్మడి జిల్లాకు ప్రత్యేకాధికారులుగా ఇద్దరు IASలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లాకు ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్న వి.వినయ్ చంద్, పార్వతీపురం మన్యం జిల్లాకు కోన శశిధర్‌ను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలపై జిల్లా అధికారుల సమన్వయంతో ఇక మీదట పర్యవేక్షించమని ఆదేశించారు.
Similar News
News September 10, 2024
పుష్పాలంకరణలో శ్రీ పైడితల్లి అమ్మవారు
విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లమ్మకు చదురుగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ప్రీతికరమైన రోజు మంగళవారం కావడంతో ఆలయ అర్చకులు వేకువజాము నుంచి పంచామృతాభిషేకాలు, పూజలు నిర్వహించారు. అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.
News September 10, 2024
బొబ్బిలి : నెలరోజులకే రూ.94లక్షలు గంగార్పణం
పారాది వద్ద వేగావతి నదిపై రూ.94 లక్షలు వెచ్చించి నిర్మించిన కాజ్వే నెల రోజులుకే గంగ పాలైంది. ఇప్పటికే నాలుగుసార్లు మరమ్మతులు చేశారు. ఈసారి వర్షాలకు ఐదు రోజులుగా నీరు పారడంతో సగం వరకు పాడైపోయింది. పూర్తిస్థాయిలో మరమ్మ తులు చేస్తే కానీ వాహనాల రాకపోకలకు వీలు ఉండదని అధికారులు అంటున్నారు. నీరు పూర్తిగా తగ్గిన తర్వాతే మరమ్మతులు చేస్తామని ఏఈ రాజు తెలిపారు.
News September 10, 2024
పెరిగిన తోటపల్లి నీటి మట్టం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తోటపల్లి ప్రాజెక్టు వద్ద ఇన్ ఫ్లో 3,710 క్యూసెక్కులగా ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెండు గేట్లు ఎత్తివేసి 2,777 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కాల్వల ద్వారా 190 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ సామర్థ్యం 2.5 టీఎంసీలకు కాగా.. ప్రస్తుతం 1.858 టీఎంసీలు ఉందన్నారు.