News March 19, 2024

ఉమ్మడి జిల్లాకు వాతావరణ శాఖ చల్లటి కబురు

image

ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి పలుచోట్ల నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఇటీవల ఎండ వేడి మీతో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుంది. జిల్లాలోని నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Similar News

News October 14, 2025

MBNR: తుమ్మల క్షమాపణ చెప్పాలి: మాజీ మంత్రి

image

మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మానవత్వం ఉందా అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కమ్మ సామాజికవర్గం ఓట్లతోనే తుమ్మల మంత్రి అయ్యారన్నారు. మాగంటి సునీత ఎమ్మెల్యే భర్త మరణిస్తే వచ్చిన ఉపఎన్నికలో ఆమె బిడ్డలు, కొడుకు ప్రచారం చేయడంపై అభ్యంతరం ఏంటని నిలదీశారు. తుమ్మల నాగేశ్వరరావు వెంటనే మాగంటి సునీతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

News October 14, 2025

MBNR: SP వీడియో కాన్ఫరెన్స్.. కీలక సూచనలు

image

MBNRలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డీ.జానకి పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
✒ పెండింగ్ FIRలు, ఛార్జ్‌షీట్లు పూర్తి చేయాలి
✒ NBW వారెంట్లు.. ప్రతి వారానికి నివేదిక సమర్పించాలి
✒ డ్రంక్ అండ్ డ్రైవ్.. ప్రత్యేక నిఘా పెట్టాలి
✒ మిస్సింగ్ వ్యక్తులు, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
✒ ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలి

News October 14, 2025

HYD: Get Ready.. ఏర్పాట్లు పూర్తి: VC

image

పాలమూరు వర్శిటీలోని ఈనెల 16న 4వ స్నాతకోత్సవనికి ఏర్పాట్లు పూర్తయ్యాయని వర్శిటీ ఉపకులపతి(VC) ఆచార్య జిఎన్ శ్రీనివాస్ Way2Newsతో తెలిపారు. స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవుతున్నారని, వ్యాపారవేత్త ఎంఎస్ఎన్ రెడ్డి (Dr.మన్నే సత్యనారాయణ రెడ్డి)కి పాలమూరు వర్శిటీ (పీయూ) గౌరవ డాక్టరేట్ గవర్నర్ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.