News July 24, 2024
ఉమ్మడి జిల్లాలోని నేటి క్రైమ్ న్యూస్..

* WGL: బాలుడిపై వీధి కుక్కల దాడి..
* MLG: జగన్నాథపురంలో రోడ్డు ప్రమాదం..
* MLG: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి..
* MHBD: ఇద్దరి ప్రాణాలు తీసిన తప్పుడు మార్గం
* WGL: గుండె పోటుతో వ్యక్తి మృతి..
* WGL: గ్రామ పంచాయితీ ట్రాక్టర్ డ్రైవర్ మృతి
* MLG: మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన సదస్సు.
Similar News
News December 21, 2025
జాతీయ కరాటే పోటీల్లో వర్ధన్నపేట బాలుడికి స్వర్ణం

భోపాల్లో నిర్వహించిన 16వ నేషనల్ WFSKO ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్-2025లో వర్ధన్నపేట పట్టణానికి చెందిన ఎం.మహాజన్ ఉపేంద్ర బంగారు పతకం సాధించాడు. పుస్కోస్ పాఠశాలలో చదువుతున్న ఉపేంద్ర, 10 ఏళ్ల లోపు బాలుర విభాగంలో దేశవ్యాప్తంగా వచ్చిన వందలాది మంది క్రీడాకారులతో తలపడి అద్భుత నైపుణ్యంతో ఈ విజయాన్ని అందుకున్నాడు. జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించిన ఉపేంద్రను పాఠశాల యాజమాన్యం అభినందించింది.
News December 21, 2025
వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు

వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ఆదివారం చికెన్ విత్ స్కిన్ KG రూ.240 నుంచి రూ.260 పలకగా స్కిన్ లెస్ KG రూ.260-రూ.280గా ఉంది. అలాగే లైవ్ కోడి రూ.170-రూ.180 పలుకుతోంది. సిటీతో పోలిస్తే పల్లెటూరులో రూ.10-20 ధర వ్యత్యాసం ఉంది.
News December 21, 2025
WGL: భద్రకాళి అమ్మవారి నేటి దర్శనం

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో ఆదివారం ఆలయ అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు చేశారు. ఆదివారం సెలవు కావడంతో భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.


