News August 4, 2024
ఉమ్మడి జిల్లాలోని నేటి ముఖ్యవార్తలు!!
✔షాద్‌నగర్: రోడ్డు ప్రమాదంతో తల్లీకొడుకు మృతి ✔’స్వచ్ఛదనం-పచ్చదనం’.. రేపటి నుంచి షురూ ✔అలంపూర్‌లో చండీ హోమాలు.. రూ.4.14 లక్షల ఆదాయం ✔పాలమూరును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి జూపల్లి ✔NGKL:మద్యం మత్తులో వ్యక్తి మృతి ✔శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి ✔అంబేడ్కర్ ఓపెన్ డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం
Similar News
News September 15, 2024
MBNR: రైతుకు’భరోసా’వచ్చేనా?
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వేలాది వ్యవసాయేతర భూములకు గతంలో రైతుబంధు పథకం ద్వారా పలువురు రూ.కోట్లు అందుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా కేవలం సాగు పొలాలకు మాత్రమే రైతు భరోసా అందించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలో రైతులకు రాష్ట్ర సర్కారు రైతు భరోసా ద్వారా తీపికబురు చెప్పేందుకు కార్యచరణ పూర్తి చేసే పనిలో నిమగ్నమయింది.
News September 15, 2024
MBNR: ఉమ్మడి జిల్లాలో నేటి ఉష్ణోగ్రత వివరాలు..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా జానంపేటలో 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా కృష్ణ లో 35.7 డిగ్రీలు, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 35.6 డిగ్రీలు, వనపర్తి జిల్లా వీపనగండ్లలో 31.9 డిగ్రీలు, నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్‌లో 29.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News September 15, 2024
MBNR: దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, ఎమ్మెల్యేలు
దేవరకద్ర ఎమ్మెల్యే గవినుల మధుసూదన్ రెడ్డి తండ్రి గవినుల కృష్ణారెడ్డి దశదిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు. కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.