News July 30, 2024
ఉమ్మడి జిల్లాలో ఆసిఫాబాద్ టాప్

బాధితులు పోగొట్టుకున్న, చోరీ అయిన సెల్ఫోన్లు గుర్తించడంలో ఉమ్మడి జిల్లాలో ఆసిఫాబాద్ ముందంజలో ఉంది. 63.98% ఫోన్ల ఆచూకీని తెలుసుకున్నారు. ఆ తర్వాత స్థానాల్లో ఆదిలాబాద్ (63.42%), రామగుండం (61.54%), నిర్మల్(61.32%) ఉన్నాయి. చరవాణులను బాధితులకు అప్పగించడంలో రామగుండం 29.15% తో 1 వ స్థానంలో ఉంది. 2వ స్థానంలో నిర్మల్(28.48 %), 3వ స్థానంలో ఆదిలాబాద్(24.63%), 4వ స్థానంలో ఆసిఫాబాద్ 22.66% ఉన్నాయి.
Similar News
News December 9, 2025
ADB: ప్రచారం ముగిసింది.. పోలింగ్ మిగిలింది

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి సెక్షన్ 163 BNSS అమలులోకి వస్తుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమని పేర్కొన్నారు. ఇప్పటి నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఆ ప్రాంతాలలో అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలన్నారు. పోలింగ్ డిసెంబర్ 11 ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని, అదే రోజు ఫలితాలు వస్తాయన్నారు.
News December 9, 2025
ఆదిలాబాద్: “నేను మీ అభ్యర్థినే.. నాకెందుకు చేయరు ప్రచారం..”

ఉమ్మడి ఆదిలాబాద్లోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలకు వినూత్న అనుభవాలు ఎదురవుతున్నాయి. సర్పంచ్ అభ్యర్థుల ప్రచారానికి వెళ్ళినప్పుడు సొంత పార్టీ నుంచి రెబల్గా పోటీలో ఉన్నవారు వారిని ఇరకాటంలో పెడుతున్నారు. “మేము కూడా మీ పార్టీనే. ఇన్నేళ్లు పార్టీ కోసం కష్టపడ్డాం. ఇప్పుడు మీరు మాకు ఎందుకు మద్దతు ఇవ్వరు. మాకు కూడా ప్రచారం చేయండి” అని అడగడంతో నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
News December 9, 2025
గర్భిణులకు ఎంసీపీ కార్డులేవు.. తాత్కాలికంగా జిరాక్స్ కార్డులు అందజేత

మాతా శిశు మరణాలను సున్న శాతానికి చేర్చడమే లక్ష్యమని వైద్య శాఖ ఉన్నతాధికారులు సమీక్షలు చేస్తున్నారు కానీ కనీసం గర్భిణులకు వివరాలను నమోదు చేసే కార్డులను సమకూర్చలేని దుస్థితి క్షేత్రస్థాయిలో నెలకొంది. గర్భిణులు సొంత ఖర్చుతోనే పాత వాటిని జిరాక్స్ తీస్తున్నారు. నార్నూర్, గాదిగూడ పీహెచ్సీలో ఈ పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి గర్భిణులకు ఎంసీపీ కార్డులు అందజేయాలని కోరుతున్నారు.


