News July 26, 2024
ఉమ్మడి జిల్లాలో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల

ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఏడాదికి 42 వేల ఇళ్లను నిర్మించనున్నారు. మరోవైపు పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామని, అసంపూర్తిగా ఉన్నవాటిని పూర్తి చేస్తామని గురువారం శాసనసభలో బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వం వెల్లడించింది. ఉమ్మడి జిల్లాలో రెండు పడకగదుల ఇళ్లు 16,254 మంజూరుకాగా.. అందులో 6,391 పూర్తయ్యాయి.
Similar News
News October 28, 2025
చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

NLG: చెకుముకి సైన్స్ సంబరాలు 2025 పోస్టర్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం తన ఛాంబర్లో ఆవిష్కరించారు. పాఠశాల స్థాయిలో 8, 9 10వ తరగతుల విద్యార్థులకు సైన్స్ టెంపర్ని అవగాహన కల్పించేలా ప్రతి ఏటా జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహణకు సహకరించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో దేవరకొండ ఏఎస్పీ మౌనిక, జేవీవీ రాష్ట్ర కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
News October 28, 2025
కన్నబిడ్డ విక్రయ ఘటనపై మంత్రి సీతక్క సీరియస్

నల్గొండ జిల్లాలో కన్నబిడ్డ విక్రయ ఘటనపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. ఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజాతో మాట్లాడి వెంటనే పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పిల్లల అమ్మకాలపై, అక్రమ దత్తతపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
News October 28, 2025
నల్గొండ: పిచ్చికుక్క బీభత్సం.. ఏడుగురికి గాయాలు

నల్గొండ నాలుగో వార్డు, కేశరాజుపల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఆ పిచ్చికుక్క దాడిలో ఏడుగురు గాయపడ్డారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువైందని, రోడ్డుపై వెళ్లే బైకర్లను కూడా వెంటాడి గాయపరుస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి, ఆ పిచ్చికుక్కను పట్టుకోవాలని వారు కోరుతున్నారు.


