News July 4, 2024

ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల మిగులు ఖాళీలు ఇలా..!

image

ఉమ్మడి జిల్లాలో పదోన్నతుల తరువాత 263 ఎస్ఏ సమాన స్థాయి ఉపాధ్యాయుల ఖాళీలు మిగిలిపోయాయి. MBNR-42, NGKL-51, WNPT-49, NRPT-57, GDWL-64 ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో ఆయా పాఠశాలల విద్యార్థులు నష్టపోతున్నారు. ఇంకా చాలా మంది ఉపాధ్యాయులు రెండేసి సబ్జెక్టుల్లో పదోన్నతి పొందగా ఒక స్థానంలో చేరగా మరో స్థానం ఖాళీగా మిగిలి పోయింది. త్వరలో పలువురు ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేయనున్నారు.

Similar News

News October 12, 2024

పాలపిట్ట, జమ్మి పత్రాల ప్రత్యేకత ఇదే..

image

దసరా పండుగ సందర్భంగా జమ్మి పత్రాలకు, పాలపిట్టకు చాలా ప్రత్యేకత ఉందని పండితులు అంటున్నారు. జమ్మి పత్రాలకు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి ఒకరికి ఒకరు పుచ్చుకొని అలైబలై చేసుకోవడం ద్వారా శత్రుత్వం కోల్పోతుందన్నారు. పాలపిట్టను చూడడం ద్వారా అపజయాలు కోల్పోయి విజయాలు దరిచేరుతాయని, పల్లెల్లో ప్రజలు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని పొలాల వెంబడి వెళ్లి పాలపిట్టను చూస్తారని పండితులు తెలిపారు.

News October 12, 2024

పోలీసుల ఆధీనంలో కొండారెడ్డిపల్లి

image

రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వస్తుండగా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లు పూర్తిచేశారు. సీఎం సొంత ఇంటి దగ్గర ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు. గ్రామానికి చేరుకున్న సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అనంతరం గ్రామస్థులతో కలిసి జమ్మిపూజలో పాల్గొంటారు. రాత్రి వరకు సీఎం ఊరిలోనే గడపనున్నట్లు సమాచారం.

News October 12, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలిలా…

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా నారాయణపేట జిల్లా దామరగిద్దలో 18.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా సల్కర్పేటలో 17.8 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా ఆత్మకూరులో 17.3 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా లింగాలలో 15.0 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా అల్వాలపాడులో 9.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.