News April 10, 2024

ఉమ్మడి జిల్లాలో కలగానే కల్లాల నిర్మాణాలు !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో యాసంగి వరి కోతలు మొదలయ్యాయి. రైతులు ధాన్యం ఆరబోతకు నానా కష్టాలు పడుతున్నారు. ఈ యాసంగిలో‌ 4,78,649 ఎకరాల్లో వరి సాగు చేశారు. మొత్తం 8.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు వేశారు. ఉపాధి హామీ పథకంలో కల్లాల నిర్మాణాలు కలగానే మిగిలాయి. ధాన్యం ఆరబోతకు ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి కల్లాల నిర్మాణాలను చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Similar News

News December 21, 2025

MBNR: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల నిఘా: ఎస్పీ

image

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో MBNR జిల్లాలో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు క్షేత్రస్థాయిలో నిఘా పెంచినట్లు పేర్కొన్నారు. “వేడుకలు జరుపుకోవడం అందరి హక్కే.. కానీ ఆ ఆనందం ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు” అని ఆమె స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News December 21, 2025

MBNR: అన్నదాతల ఖాతాల్లోకి బోనస్ నిధులు..

image

MBNR జిల్లాలోని సన్న వరి సాగుదారులకు ఆర్థిక ఊరట లభించింది. ప్రభుత్వం ప్రకటించిన సన్న రకం బోనస్ కింద రూ.21.95 కోట్లను రైతు ఖాతాల్లో జమ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో మొత్తం 7,971 మంది రైతులు ఈ బోనస్‌కు అర్హత సాధించగా, డిఎం రవి నాయక్ వివరాలను వెల్లడించారు. ముందుగా 4000 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు చేరుతాయని, అనంతరం మిగిలిన రైతులకు జమ చేస్తామని ఆయన పేర్కొన్నారు.

News December 21, 2025

MBNR: ఈనెల 22న ‘మాక్ డ్రిల్’: అదనపు కలెక్టర్

image

జాతీయ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశాలతో MBNR జిల్లాలో 6 ప్రదేశాలలో ‘మాక్ డ్రిల్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీసీ కాన్ఫరెన్స్ హాల్‌లో రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, ఇరిగేషన్, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్&బి, పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి, మాక్ డ్రిల్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.