News August 5, 2024

ఉమ్మడి జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> MHBD: సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించిన పోలీసులు
> WGL: స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం
> MHBD: జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం
> HNK: ఇటుకాలపల్లిలో పోలీసుల కార్డన్ సేర్చ్
> WGL: రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య
> MLG: డ్రగ్స్ కి అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు: ఎస్సై
> BHPL: లైంగిక వేధింపులకు గురికాకుండా ఆడపిల్లలకు అవగాహన సదస్సు

Similar News

News September 9, 2024

వరంగల్ మార్కెట్లో మొక్కజొన్నకు రికార్డు ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న మరోసారి రికార్డు ధర పలికింది. గత వారం మార్కెట్లో క్వింటా మొక్కజొన్న ధర రూ.3,015 పలకగా.. నేడు అదే ధర పలికి రికార్డును కొనసాగించింది. మార్కెట్ చరిత్రలోనే ఇంత ధర రావడం ఇదే మొదటిసారి అని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో మొక్కజొన్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News September 9, 2024

అవినీతి నిర్మూలనే ధ్యేయం: సీఎండీ వరుణ్ రెడ్డి

image

TGNPDCL సంస్థలోని ఉద్యోగులు భారీ వర్షాలను వరదలను సైతం లెక్కచేయకుండా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి నిబద్ధతతో పనిచేస్తున్నారని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, ఎవరైనా లంచం అడిగితే 92810 33233 నంబరుకు, విజిలెన్స్ విభాగానికి సమాచారం ఇవ్వాలన్నారు. అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1064లో ఫిర్యాదు చేయాలన్నారు.

News September 9, 2024

వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజా మిర్చి క్వింటాకు నేడు రూ.18,200 పలికింది. అలాగే 341 రకం మిర్చికి రూ.14,500 ధర రాగా వండర్ హాట్(WH) మిర్చికి రూ.15,500 ధర వచ్చిందని వ్యాపారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తూ నాణ్యమైన సరుకులు మార్కెట్‌కు తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు.