News September 8, 2024
ఉమ్మడి జిల్లాలో గణనీయంగా పెరిగిన BSNL

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 19 లక్షల చరవాణి, 6వేల వరకు FTTH కలెక్షన్లు ఉన్నాయి. జూలైలో 11,305, ఆగస్టులో 12,718 మంది కొత్తగా BSNL సిమ్ కార్డులు కొనుగోలు చేశారు. 2 నెలల నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 108 ప్రాంతాల్లో 4G టవర్లు ఏర్పాటు చేశామని, ఇంకా 60 4G టవర్లు అందుబాటులో తీసుకొస్తామని, BSNLలో రూ.10 నుంచి రూ.3వేల వరకు ధరలతో 12 రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయని డీజీఎం వెంకటేశ్వర్లు తెలిపారు.
Similar News
News October 23, 2025
మహమ్మదాబాద్లో అత్యధిక వర్షపాతం

మహబూబ్నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో మహమ్మదాబాద్ మండలంలో 13.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. హన్వాడ 13.7, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 4.8, గండీడ్ మండలం సర్కార్ పేట, దేవరకద్ర 3.8 , మహబూబ్నగర్ గ్రామీణం, భూత్పూర్ 3.3, జడ్చర్ల 3.0, నవాబుపేట మండలం కొల్లూరు 2.5, బాలానగర్ 2.0 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది.
News October 23, 2025
చలో రాజ్ భవన్: రాచాల యుగంధర్ గౌడ్

సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ బీసీ పొలిటికల్ JAC ఆధ్వర్యంలో భారీ స్థాయిలో “ఛలో రాజ్ భవన్” కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీసీ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈరోజు ఉదయం 10:00 గంటలకు హైదరాబాద్లోని రాజ్ భవన్ వద్ద జరుగనున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
News October 23, 2025
నేడే ఫైనల్.. సూపర్ కింగ్స్ ❌ ఛాలెంజర్స్

తెలుగు వర్సిటీలో గత నెల రోజులుగా “స్పోర్ట్స్ మీట్-2025” ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు క్రికెట్ విభాగంలో తెలుగువర్సిటీ సూపర్ కింగ్స్(ముస్తాక్) జట్టు, తెలుగువర్సిటీ ఛాలెంజర్స్(వినోద్) జట్టు ఫైనల్కు చేరుకున్నాయి. నేడు విఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల క్రీడా మైదానంలో ఫైనల్ నిర్వహించనున్నారు. అదేవిధంగా సౌత్ జోన్లో పాల్గొన్నందుకు వర్సిటీ క్రీడాకారులకు అథ్లెటిక్స్ నిర్వహించి, ఎంపికలు చేయనున్నారు.