News June 14, 2024

ఉమ్మడి జిల్లాలో చల్లబడ్డ వాతావరణం..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా సిరివెంకటాపూర్లో 33.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా ఉట్కూరులో 32.7, వనపర్తి జిల్లా గోపాల్ పేటలో 32.4, నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లిలో 31.8, గద్వాల జిల్లా అల్వాలపాడు 29.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News September 15, 2025

MBNR: భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ

image

ఎస్పీ డి.జానకి సోమవారం మహబూబ్‌నగర్‌లోని భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె షీ టీమ్, ఏహెచ్‌టీయూ, కళాబృందం, భరోసా కేంద్రం సభ్యులతో సమావేశం నిర్వహించారు. మహిళలు, విద్యార్థినులకు వేధింపులు జరగకుండా కృషి చేయాలని, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.

News September 15, 2025

MBNR: ప్రజావాణికి 15 ఫిర్యాదులు: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి ప్రజల నుంచి 15 వినతిపత్రాలను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా పరిశీలించిన ఎస్పీ, సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి సమస్యపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఎస్పీ తెలిపారు.

News September 14, 2025

GREAT: 97 సైబర్ కేసులు.. రూ.32,19,769 రిఫండ్

image

MBNRలోని నమోదైన సైబర్ క్రైమ్ కేసులను 97 ఛేదించినట్లు సైబర్ క్రైమ్ SI శ్రవణ్ కుమార్ Way2Newsతో తెలిపారు. 97 మంది బాధితులకు సంబంధించి రూ.32,19,769 ఫ్రీజ్ చేయించి రిఫండ్ చేయించామని, సైబర్ సెక్యూరిటీ బ్యూరో బాధితులకు రిఫండ్ ఆర్డర్ కాపీలు అందజేశామన్నారు. బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో SP జానకి, అడిషనల్ ఎస్పీ రత్నం అభినందించారు. సైబర్ నెరగాళ్లతో మోసపోయినట్లు తెలిస్తే గంటలోపు 1930 కాల్ చేయాలన్నారు.