News September 23, 2024

ఉమ్మడి జిల్లాలో జట్లు ఎంపిక పోటీలు

image

ఉమ్మడి ప.గో.జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 2024-25 సంవత్సరానికి అండర్-14, 17 బాల బాలికలకు జిల్లా జట్లు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి మల్లేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా 25న గొరగనమూడి హైస్కూల్లో నెట్ బాల్, పెదవేగి గురుకుల పాఠశాలలో సాఫ్ట్ బాల్, బేస్ బాల్, 26న భీమవరం SCHBRMHSలో రైఫిల్ షూటింగ్, అక్టోబర్ 1న పెనుమంట్రలో బాక్సింగ్ పోటీలు జరుగుతాయన్నారు.

Similar News

News October 28, 2025

తణుకు: ఇద్దరు డీఎస్పీలు ఒక్కటయ్యారు

image

ప.గో జిల్లా తణుకులో ఇద్దరు DSPల వివాహ మహోత్సవం జరిగింది. గతంలో చందోలు PSలో ట్రైనింగ్‌ డీఎస్పీగా విధులు నిర్వహించి, ప్రస్తుతం కృష్ణా జిల్లా అవనిగడ్డ డీఎస్పీగా పనిచేస్తున్న విద్యశ్రీ(స్వగ్రామం ప.గో(D) పాలంగి), పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీగా పనిచేస్తున్న జగదీష్ వివాహ వేడుక ఆదివారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. పోలీసు శాఖలో ఒకే క్యాడర్‌లో ఉన్న అధికారులు ప్రేమ వివాహం చేసుకోవడం విశేషం.

News October 27, 2025

ప.గోలో ముంపు ప్రాంతాలివే!

image

మొంథా తుఫాను నేపథ్యంలో జిల్లాలో అత్యంత ముప్పు ప్రాంతాలుగా 12 గ్రామాలను అధికారులు ప్రకటించారు. నరసాపురం పరివాహక ప్రాంతాలైన పేరుపాలెం నార్త్ , పేరుపాలెం సౌత్, కేపీపాలెం నార్త్, కేపీ పాలెం సౌత్, పెదమైన వాని లంక, చినమైన వాని లంక, దర్భరేవు, వేములదీవిఈస్ట్, వేములదీవి వెస్ట్, తూర్పు తాళ్లు, రాజులంక, బియ్యపుతిప్ప గ్రామాలను ప్రకటించారు. ఇక్కడే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాటు చేస్తున్నారు.

News October 27, 2025

మొంథా తుఫాన్.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి: కలెక్టర్

image

మొంథా తుపాను సందర్భంగా ఎటువంటి సమస్యలు తలెత్తినా ఏలూరు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08816 299219 ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి సూచించారు. సోమవారం కలెక్టర్, ఎస్పీ కలిసి కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. వచ్చిన కాల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అందరూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.