News April 3, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

✏నేటి నుంచి 10వ తరగతి వ్యాల్యూషన్
✏దేవరకద్ర:నేడు ఉల్లిపాయల వేలం
✏నేటి రంజాన్ వేళలు:
ఇఫ్తార్(బుధ)-6:36,సహార్(గురు)-4:38
✏MBNR:నేడు PUలో ఉద్యోగ మేళా
✏ఉమ్మడి జిల్లాలో గంజాయి, సారా నియంత్రణపై అధికారుల ప్రత్యేక ఫోకస్
✏అలంపూర్:నేడు పలు గ్రామాలలో కరెంట్ కట్
✏వరి కొనుగోలు ధాన్యాలపై అధికారుల సమీక్ష
✏పలు నియోజకవర్గాల్లో MBNR&NGKL ఎంపీ అభ్యర్థుల పర్యటన
✏ఎలక్షన్ కోడ్.. ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో నిఘా
Similar News
News February 8, 2026
MBNR: రేపటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం

మహబూబ్‌నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎస్పీ డి.జానకి స్పందిస్తూ.. ప్రచార సమయం ముగిసిన వెంటనే బయటి ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు, కార్యకర్తలు జిల్లా విడిచి వెళ్లాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 8, 2026
MBNR: రేపటితో ముగియనున్న ప్రచారం

ఉమ్మడి జిల్లాలోని ఒక కార్పొరేషన్,18మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఫిబ్రవరి 3న మొదలైన ఎన్నికల ప్రచార హోరు రేపు సాయంత్రం ముగియనుంది. ప్రచారానికి రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అన్ని పార్టీల అగ్రనేతలు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు 5నుంచి 6కార్నర్ మీటింగ్ లతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంచేస్తున్నారు.
News February 8, 2026
MBNR: పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాలి

ఎన్నికల విధులలో పాల్గొనే మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కమిషనర్ రామంజుల రెడ్డి కోరారు. మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని మెప్మా భవనంలో ఏర్పాటు చేసిన సెంటర్‌లో ఆదివారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు.


