News August 17, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి టాప్ న్యూస్..

> MHBD: కొడుకు విగ్రహం చేయించిన తండ్రి
> MLG: పోడు భూముల అంశంపై సమీక్ష నిర్వహించిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క
> HNK: జిల్లాలో సందడి చేసిన ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్
> WGL: కలకత్తా వైద్య విద్యార్థిని అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలని నిరసనలు
> MHBD: ప్రశాంతంగా కొనసాగిన జిల్లా బంద్
> JN: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా రాఖీ పండుగ వేడుకలు.
Similar News
News October 25, 2025
పర్వతగిరి: గిరాకీ లేదు.. వైన్ షాప్ ఎత్తేయండి..!

తమ పరిధిలోని ఒక వైన్ షాప్‌నకు గిరాకీ లేదని, షాప్ ఎత్తేయాలని ఏకంగా ఎక్సైజ్ అధికారులే ఉన్నతాధికారులకు ప్రతిపాదించారు. అదేంటీ.. వైన్ షాపులకు వాస్తు లేకున్నా గిరాకీ ఫుల్లుగా ఉంటుంది కదా అని ఆశ్చర్యపోతున్నారా..? కానీ ఇది నిజం. పర్వతగిరి మండలంలోని చింత నెక్కొండ గ్రామంలో గల వైన్ షాపు టార్గెట్ చేరుకోలేదని షాపును తొలగించారు. దీంతో మండలంలో 6 వైన్ షాపులు ఉండగా.. ప్రస్తుతం ఒకటి తొలగించడంతో ఐదుకు తగ్గింది.
News October 25, 2025
వరంగల్ కలెక్టరేట్లో స్పెషల్ గ్రీవెన్స్

వరంగల్ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్ధులకు శనివారం స్పెషల్ గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి రాజమణి తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్పెషల్ గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
News October 25, 2025
వరంగల్: గుర్తింపు, హరిత నిధుల ఫీజులు చెల్లించాలి..!

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల కళాశాలలు గుర్తింపు ఫీజుతోపాటు హరితనిధి చెలించాలని డీఐఈవో డా.శ్రీధర్ సుమన్ పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్లో సంబంధిత కాలేజీ లాగిన్ ద్వారా గుర్తింపు ఫీజు తప్పక చెల్లించాలని సూచించారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు రూ.220, హరితనిధి రూ.15 కలిపి మొత్తం రూ.235 చొప్పున చెల్లించాలన్నారు. విద్యార్థుల పూర్తి వివరాలను ఆన్లైన్ చెక్ లిస్టులతో చూడాలన్నారు.


