News August 7, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి టాప్ న్యూస్
> MLG: కార్పొరేట్ కంపెనీలు గ్రామాలకు తరలిరావాలి: సీతక్క
> HNK: కలెక్టర్ కార్యాలయంలో 2వ ఆర్థిక సంఘ సమావేశం
> WGL: జిల్లా వ్యాప్తంగా చేనేత దినోత్సవ వేడుకలు
> MHBD: ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం.. అలుగులు దుంకుతున్న చెరువులు
> WGL: మార్కెట్లో పెరిగిన మిర్చి ధర, తగ్గిన పత్తి ధర
> MLG: జిల్లాలో మరో అద్భుతమైన జలపాతం
> JN: ఈ కోనేరులో స్నానం చేస్తే పాపాలు తొలుగుతాయి!
Similar News
News September 8, 2024
వరంగల్: ఎన్పీడీసీఎల్‌లో అవినీతి నిర్మూలించడానికి శ్రీకారం
టీజీ ఎన్పీడీసీఎల్‌లో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఎవరైనా లంచం అడిగితే ఉపేక్షించదని యాజమాన్యం తెలిపింది. సంస్థలో అవినీతి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సాధించామని అన్నారు. సేవలకు ప్రతిఫలంగా లంచం అడిగితే 9281033233, 1064కు కాల్ చేయాలని తెలిపారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిల్లో అన్ని కార్యాలయంలో పోస్టర్లను పెట్టడం జరిగిందన్నారు.
News September 8, 2024
దీప్తిని సన్మానించిన మంత్రి సీతక్క
పారాలింపిక్స్‌లో కాంస్య పథకం సాధించిన దీప్తి జీవంజిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఘనంగా సన్మానించారు. వరంగల్ జిల్లాకు చెందిన దీప్తి పథకం సాధించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని సీతక్క అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సాట్ చైర్మన్ శివసేనారెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.
News September 8, 2024
ములుగు: విపత్తుతో నేల కూలీల చెట్లు.. పర్యాటక ప్రాంతంగా మారింది!
తాడ్వాయి-మేడారం అడవుల్లో కొన్ని రోజుల క్రితం విపత్తు కారణంగా వేల చెట్లు నేలకొరిగాయి. ఇప్పుడు ఆ ప్రాంతం చెట్లను కోల్పోయి వెలవెలబోతోంది. విపత్తు కారణంగా నేలకూలిన చెట్లను చూడటానికి చుట్టుపక్కల మండల ప్రజలు, విద్యార్థులు, మేడారం దర్శనం కోసం వచ్చే భక్తులు పర్యాటక ప్రాంతంగా తరలివచ్చి వీక్షిస్తున్నారు. అందరూ సెల్ ఫోన్లో చిత్రీకరించుకుంటున్నారు. ఎప్పుడు ఇంతటి విపత్తు చూడలేదని వారు తెలిపారు.