News May 7, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

▶ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
▶NRPT:BRSకు నలుగురు కౌన్సిలర్ల రాజీనామా
▶EVM స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన అధికారులు
▶MP ఎన్నికలు.. ప్రచారంలో స్పీడ్ పెంచిన జిల్లా నేతలు
▶దళితుడిని మంత్రిని చేసిన ఘనత మోదీది:మందకృష్ణ
▶జిల్లాలో పలుచోట్ల ఉపాధి కూలీలకు ఈవీఎంలపై అవగాహన కార్యక్రమాలు
▶కొల్లాపూర్:KCR గడీలో.. RSP బందీ: మంత్రి జూపల్లి
▶కొత్తపల్లి:బోనులో చిక్కిన చిరుత

Similar News

News January 8, 2025

MBNR జిల్లా ఆసుపత్రిలో డెవలప్‌మెంట్ కమిటీ కీలక భేటీ

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంపీ డీకే అరుణ బుధవారం డెవలప్‌మెంట్ కమిటీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆస్పత్రుల అప్ గ్రేడ్, ఇతర అభివృద్ధి పనుల కోసం భారీగా నిధుల మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే అధికారులు పాల్గొన్నారు.

News January 8, 2025

AMAZING: తాజ్‌మహల్‌లో పాలమూరు రాళ్లు!

image

తాజ్‌మహల్ నిర్మాణంలో మహబూబ్‌నగర్ ప్రాంతంలో లభించే క్రిస్టల్ క్వార్ట్‌జ్ రాళ్లను(పలుగు రాళ్లు) వాడినట్లు తాజాగా వెల్లడైంది. కాలిఫోర్నియాలోని జెమోలాజికల్‌ లైబ్రరీ& రీసెర్చ్‌ సెంటర్‌ నుంచి రిటైర్డ్‌ లైబ్రేరియన్‌ డిర్లామ్, రీసెర్చ్‌ లైబ్రేరియన్‌ రోజర్స్, సంస్థ డైరెక్టర్‌ వెల్డన్‌ కలిసి అధ్యయనం చేపట్టారు. పర్చిన్‌‌కారి పద్ధతిలో ఈ రాళ్లను తాజ్‌మహల్ పాలరాతిలో అంతర్భాగంగా అమర్చినట్లు గుర్తించారు.

News January 8, 2025

MBNR: తగ్గిన ధరలు.. టమాటా రైతుల ఆందోళన

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు సీజన్లలోనూ 1,690 ఎకరాల్లో రైతులు టమాటా సాగు చేశారు. గిట్టుబాటు ధర రాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల క్రితం కిలో రూ.25-30 పలకగా.. ప్రస్తుతం రూ.10కి పడిపోయింది. పట్టణంలోని రైతు‌బజార్‌లో రూ.10 నుంచి రూ.15లకు విక్రయిస్తున్నారు. పంట ఉత్పత్తి పెరగడం, రైతులంతా ఒకేసారి మార్కెట్లకు పంట దిగుబడులు తీసుకురావడంతో ధరలు పడిపోయాయని ఉద్యాన శాఖ అధికారి వేణుగోపాల్ తెలిపారు.