News March 21, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు..!
*ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇస్తాం: మంత్రి జూపల్లి
*చైనాలో గుండెపోటుతో పాలమూరు వాసి మృతి
*MBNR:కారు,బైక్ ఢీ.. కాంగ్రెస్ నేత మృతి
*జాగ్రత్త..ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు
*NGKL:కన్న కొడుకును హత్య చేసిన తల్లి
*దేశం కోసం మోదీ అనే నినాదంతో ముందుకు వెళ్ళాలి: డీకే అరుణ
*MPగా గెలిపించండి: వంశీ చంద్ రెడ్డి
*ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న పదో తరగతి పరీక్షలు
*NRPT:పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఎస్పీ
Similar News
News September 14, 2024
జమ్ములమ్మ ఆలయాన్ని ఆకాశం నుండి చూశారా..?
గద్వాల జిల్లాలోని జమ్మిచెడు జమ్మలమ్మ దేవస్థానాన్ని ఎప్పుడైనా ఆకాశం నుండి చూసారా ? చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. దేవస్థానం వారు ఇటీవల డ్రోన్ కెమరా ద్వారా టెంపుల్ వ్యూ ను పై నుండి దేవస్థానాన్ని ఫోటో తీశారు. చుట్టు ముట్టు నిండుగా నీరు ఉండి మధ్యలో ఈ ఆలయం ఉంటుంది .ఓక్క మాటలో చెప్పాలంటే ఈ ఆలయం ద్వీపం వలే ఉంటుంది .
News September 14, 2024
NRPT: ఇక్కడ 48 ఏళ్లుగా ఆ ఊరిలో ఒకే దేవుడు..!
నారాయణపేట మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో 48ఏళ్లుగా ఒకే వినాయకుడిని ప్రతిష్ఠించి ఐకమత్యాన్ని చాటుకుంటున్నారు. సాధారణంగా గ్రామాల్లో, పట్టణాల్లో వాడవాడలా గణనాథుడిని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. అందుకు భిన్నంగా గ్రామంలో ఒకే గణనాథుడిని విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. శుక్రవారం శ్రీగిరి పీఠం శివానంద స్వామి వినాయకుడిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఐకమత్యాన్ని కొనియాడారు.
News September 14, 2024
రేపు పాలమూరుకు సీఎం రేవంత్ రెడ్డి రాక
సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 15న చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్‌కు రానున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే G.మధుసూదన్ రెడ్డి తెలిపారు. MLA మధుసూదన్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ఇటీవల మృతి చెందగా.. 15న నిర్వహించే దశ దిన కర్మకి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఎస్పీ జానకి సీఎం రాకతో ఏర్పాట్లపై సమీక్షించారు.