News September 12, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు !

image

❤ఉమ్మడి జిల్లా ఖోఖో సబ్ జూనియర్స్ బాల,బాలికల జట్లు ఎంపిక
❤ఆత్మకూరు: పందికి పాలు పట్టించిన ఆవు❤దేవరకద్ర: పొదల్లో నవజాత శిశువు లభ్యం❤BSC డిప్లమాలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించిన పాలమూరు వాసి
❤MBNR:దొంగతనానికి వెళ్లి ఇద్దరు దుర్మరణం
❤కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:BJP
❤GDWL:Way2News ఎఫెక్ట్.. ప్రమాదకర విద్యుత్ వైర్లు తొలగింపు
❤కార్మికుల బకాయిలు చెల్లించండి:AITUC

Similar News

News November 19, 2025

ధర్మాపూర్ వైన్స్ షాపునకు నేడు రీ-లక్కీ డిప్

image

ధర్మాపూర్లోని 16వ నంబర్ వైన్స్ షాప్ లైసెన్సును ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పీఈటీ లక్కీ డిప్‌లో దక్కించుకున్నారు. ఈ విషయంపై ఆమెను సస్పెండ్ చేయగా, ఆమె లైసెన్సును రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్‌కు లేఖ ఇచ్చారు. దీంతో ఆ టెండర్‌ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు మిగిలిన పోటీదారులతో రీ-టెండర్ నిర్వహించనున్నారు.

News November 18, 2025

MBNR: వాలీబాల్ ఎంపికలు.. 500 మంది హాజరు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో వాలీబాల్ ఎంపికలు నిర్వహించారు. డీఈవో ప్రవీణ్ కుమార్, స్టేట్ ఎస్జీఎఫ్ సెక్రటరీ ఉషారాణి, జడ్చర్ల ఎంఈఓ మంజులా దేవి, SGF జిల్లా సెక్రటరీ డాక్టర్ ఆర్.శారదాబాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తం 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పీడీలు వేణుగోపాల్, రామచందర్, రాములు, ముస్తఫా, కృష్ణ, మోహిన్, రవికుమార్ గౌడ్, శంకర్ పాల్గొన్నారు.

News November 18, 2025

MBNR: వేతనాలు అకౌంట్లో జమ:వీసీ

image

పాలమూరు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి యూనివర్సిటీ వీసీ జిఎన్ శ్రీనివాస్ గుడ్ న్యూస్ తెలిపారు. ఇవాళ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత 3,4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి ఐఎఫ్ఎమ్ఎస్, పిఎఫ్ఎంఎస్ ద్వారా వేతనాలను జరుగుతుందన్నారు. వేతనాలు వారి అకౌంట్లో జమ అయ్యే విధంగా ప్రయత్నించినారని తెలిపారు.