News September 27, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!
❤ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
❤MBNR:30న ఉమ్మడి జిల్లా రెజ్లింగ్ ఎంపికలు
❤దామరగిద్ద మండలంలో చిరుత సంచారం
❤డబ్బుల మూటలు సదిరెందుకే కాంగ్రెస్ హైడ్రా డ్రామాలు:DK అరుణ
❤అయిజ: టీచర్లను నియమించాలని విద్యార్థులు ఆందోళన
❤ధన్వాడ:చిరుత దాడిలో ఎద్దు మృతి
❤వనపర్తి:ఘనంగా వరల్డ్ టూరిజం డే
❤లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి: బార్ అసోసియేషన్
❤గండీడ్: గ్యాస్ సబ్సిడీ పత్రాలు పంపిణీ.. MLAకు ఘన సన్మానం
Similar News
News October 16, 2024
గద్వాల్: ఎల్ఆర్ఎస్ సమస్యలను పరిష్కరించాలి:కలెక్టర్
గ్రామపంచాయతీ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాలులో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని గ్రామీణస్థాయిలో ఉన్న LRS క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా చేయాలని సూచించారు.
News October 15, 2024
ఉమ్మడి జిల్లా నేటి వర్షపాతం వివరాలు ఇలా…
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా చిన్నపురవపల్లి లో 13.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా కేతపల్లిలో 2.5 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా అలంపూర్ లో 1.3 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా మాగనూరులో 0.5 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా సల్కర్పేటలో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
News October 15, 2024
MBNR: నేటి నుంచి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు
రాష్ట్ర ప్రభుత్వం శాఖ ఆదేశాల మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి 220 బృందాలు ప్రధానంగా గేదెలు, ఆవులు, పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారులు ప్రత్యేక బృందాలను నియమించారు. పెంపకందార్లు పశువులకు ఉచితంగా ఈ టీకాలను వేసుకోవాలని అధికారులు తెలిపారు.