News January 19, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

✔ఉమ్మడి జిల్లాల్లో జోరుగా వరి సాగు
✔అయిజ:BRS కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరిక
✔అచ్చంపేట:మూడు కార్లు ఢీ.. ఒకరు మృతి
✔ఘనంగా Sr. ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
✔ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్ష
✔అచ్చంపేట:కత్తితో దాడి.. వ్యక్తికి తీవ్రగాయాలు
✔NGKL: ఉమామహేశ్వర స్వామికి నంది వాహన సేవ
✔డ్రంక్ అండ్ డ్రైవ్..పోలీసుల తనిఖీలు
✔రాష్ట్ర మహా సభల వాల్ పోస్టర్ విడుదల
✔క్రీడా బహుమతులు ప్రధానం చేసిన ఎమ్మెల్యేలు
Similar News
News February 8, 2025
షాద్‌నగర్: 10న అప్రెంటిస్ షిప్ మేళా

షాద్‌నగర్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 10వ తేదీన అప్రెంటిస్ షిప్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ లక్ష్మణ్ తెలిపారు. ఉదయం 10 గం.లకు కళాశాలలో ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
News February 8, 2025
వనపర్తి: చికిత్స పొందుతూ మహిళ మృతి

ఈ నెల 2వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరిన చంద్రమోహన్, లక్ష్మమ్మల కారు కొత్తకోట ముమ్మళ్లపల్లి స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మకు తీవ్ర గాయాలు కాగా.. HYDలోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. ఈ మేరకు కేసు నమోదైంది.
News February 8, 2025
NGKL: యువకుడి ఆత్మహత్య

తాను ప్రేమించిన యువతి ఇంట్లో తమ పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు ఆత్మహత్యకి పాల్పడిన ఘటన శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. NGKL మండలం పెద్దాపూర్‌కి చెందిన యాదగిరి (23) ఓ యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవటంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి అన్న సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.