News July 13, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు ఇలా..

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. మహబూబ్ నగర్ జిల్లా కొత్త మోల్గారాలు 45.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగర్ కర్నూలు జిల్లా కోడేరులో 39.3 మి.మీ, వనపర్తి జిల్లా విలియంకొండ 36.8 మి.మీ, నారాయణపేట జిల్లా ధన్వాడలో 31.3 మి.మీ, గద్వాల జిల్లా కేంద్రంలో 16.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
Similar News
News February 19, 2025
NRPT: పాపం పసిపాప.. అప్పు తెచ్చినా బతకలేదు

వేడి నీరు పడి తీవ్రంగా గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నర్వ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. మండలానికి చెందిన మనీష, రాజేశ్ దంపతులకు ఐదు నెలల తనుశ్రీ ఉంది. నెల క్రితమే చిన్నారికి నామకరణం చేశారు. ఈనెల 13న మనీష కుమార్తెను ఎత్తుకుని, వేడి నీటి బకెట్‌ని తీసుకెళ్తుండగా జారిపడింది. ఆ నీరు పడి తల్లీకుమార్తెకు గాయాలయ్యాయి. దాదాపు రూ.2.5లక్షల అప్పుచేసి, చూపించినా పాప దక్కలేదు.
News February 19, 2025
MBNR: ఎముక గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

పెళ్లిలో భోజనం చేస్తుండగా.. ఎముక ఇరుక్కుని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన బాలానగర్ మండల పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. MBNR మండలం దొడ్డలోనిపల్లికి చెందిన జహంగీర్(49) తిర్మలాయకుంటతండాలో ఓ పెళ్లికి వెళ్లాడు. భోజనం చేస్తుండగా.. గొంతులో ఎముక ఇరుక్కుని కిందపడిపోయాడు. అక్కడున్నవారు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదైంది.
News February 19, 2025
NGKL: ప్రేమ పేరుతో మోసం.. బాలికకు 9 నెలల కొడుకు

ప్రేమ పేరుతో ఓ బాలికను మోసంచేసి తల్లిని చేసిన ఘటన NGKL జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. భూత్పూర్ మం. కొత్తమూల్గరకు చెందిన ఎండీ జాఫర్(33) RTCలో అద్దె బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఓ బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోవాలని నిలదీయగా.. తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాలిక పోలీసులను నిన్న ఆశ్రయించింది. ప్రస్తుతం బాలికకు తొమ్మిదినెలల కుమారుడు ఉన్నాడు.