News July 15, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు ఇలా
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా.. అత్యధికంగా నారాయణపేట జిల్లా నర్వాలో 61.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా ఆత్మకూరులో 59.3 మి.మీ, మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంటలో 51.5 నాగర్ కర్నూల్ జిల్లా లింగాలలో 42.5 మి.మీ, గద్వాల జిల్లా ద్యాగడ్డోడిలో 32.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
Similar News
News October 16, 2024
BREAKING: నాగర్‌కర్నూల్: దంపతుల దారుణ హత్య
రంగారెడ్డి జిల్లాలో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు.. కందుకూరు PS పరిధి కొత్తగూడ ఫామ్ హౌస్‌లో దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఉషయ్య(55), శాంతమ్మ(50)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 16, 2024
శ్రీశైలానికి 1,23,314 క్యూసెక్కుల వరద
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. సుమారుగా 1,23,314 క్యూసెక్కుల వరద వస్తోంది. బుధవారం ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది.శ్రీశైలం ప్రాజెక్ట్ భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 16.415 ఎం.యూ. విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, కుడిగట్టు కేంద్రంలో 15.015 మి.యూ. విద్యుదుత్పత్తి చేస్తూ 30,752 క్యూసెక్కులు మొత్తం 66,067 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
News October 16, 2024
గద్వాల: కల్వర్ట్‌ను ఢీ కొట్టిన కారు.. మాజీ జడ్పీటీసీ కుమారుడు మృతి
రోడ్డు ప్రమాదంలో మాజీ జడ్పీటీసీ కుమారుడు మృతిచెందాడు. ఈ ఘటన మల్దకల్ మండలంలో బుధవారం జరిగింది. మల్దకల్ మండల మాజీ ZPTC పటేల్ అరుణ- ప్రభాకర్ రెడ్డి కుమారుడు రాంచంద్రారెడ్డి ఎర్రవల్లి నుంచి గద్వాల వెళ్తుండగా దయ్యాలవాగు వద్ద కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతిచెందారు.