News August 8, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలిలా…

image

ఉమ్మడి జిల్లాలో గురువారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా మాగనూరులో 28.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేటలో 19.8 మి.మీ, వనపర్తి జిల్లా అమరచింత 19.0 మి.మీ, నాగర్ కర్నూల్ జిల్లా వటవర్లపల్లిలో 14.0 మి.మీ, గద్వాల జిల్లా బీచుపల్లిలో 10.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

Similar News

News November 24, 2025

జడ్చర్ల: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

రోడ్డు ప్రమాదంలో బైక్ పై వెళుతున్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మిడ్జిల్ మండలం రాణిపేట గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు వివరాలు ప్రకారం.. 167 జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టగా తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 23, 2025

MBNR: పోలీస్ కార్యాలయంలో సత్యసాయిబాబా జయంతి వేడుకలు

image

పుట్టపర్తి సత్యసాయిబాబా 100వ జయంతి సందర్భంగా ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.జానకి పూలమాల వేసి సత్యసాయి బాబా చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీసీఆర్‌బీ డీఎస్సీపీ రమణారెడ్డి, ఆర్ఐలు కృష్ణయ్య, నగేష్, శైలు‌తో పాటు పోలీస్ శాఖకు చెందిన ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

News November 23, 2025

అరుణాచలం వెళ్లే భక్తులకు పాలమూరు డిపో శుభవార్త

image

మహబూబ్ నగర్ జిల్లా నుంచి తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచల ప్రదక్షణకు వెళ్లే భక్తులకు డిపో మేనేజర్ సుజాత శుభవార్త తెలిపారు. డిసెంబర్ 3న బస్సు సాయంత్రం 7 గంటలకు బయలుదేరుతుందన్నారు. ప్యాకేజీ రూ.3600 ఉంటుందన్నారు. https://tsrtconline.in బుక్ చేసుకోవాలని తెలిపారు. 9441162588 నంబర్‌‌ను సంప్రదించాలన్నారు.