News June 5, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలివే…

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో 21.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్ నగర్ జిల్లా సెరివెంకటాపూర్లో 12.0 మి మీ, నారాయణపేట జిల్లా కొత్తపల్లిలో 16.0 మి.మీ, గద్వాల జిల్లా ధరూరులో 8.8 మి.మీ, వనపర్తి జిల్లా ఆత్మకూరులో 5.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

Similar News

News November 11, 2025

MBNR: ఖో-ఖో సెలక్షన్స్.. విజేతలు వీరే..!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14 విభాగంలో బాల, బాలికలకు ఖో-ఖో ఎంపికలు నిర్వహించారు. మొత్తం 550 మంది క్రీడాకారులు పాల్గొనగా.. ఎంపికైన వారిని ఉమ్మడి జిల్లా స్థాయికి పంపించారు.
✒బాలికల విభాగం
1)మొదటి బహుమతి:బాలానగర్
2)రెండవ బహుమతి:మహమ్మదాబాద్
✒బాలుర విభాగం
1)మొదటి బహుమతి:నవాబ్ పేట్
2)రెండో బహుమతి:కోయిలకొండ

News November 11, 2025

జడ్చర్ల: 305 గ్రాముల గంజాయి స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

image

జడ్చర్ల మండలం బండమీదిపల్లి శివారు ఆర్.బి.ఆర్ కంపెనీలో వంట మాస్టర్‌గా పనిచేస్తూ గంజాయి విక్రయిస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ప్రకాష్ రవిదాస్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద 350 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎక్సైజ్ సీఐ విప్లవ రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై కార్తీక్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ సిద్ధార్థ పాల్గొన్నారు.

News November 10, 2025

MBNR: రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు: మంత్రి

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ధాన్యానికి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.