News January 21, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔గణతంత్ర దినోత్సవం పకడ్బందీగా ఏర్పాటు చేయండి:కలెక్టర్లు
✔వరి సాగు.. రైతన్నలు బిజీబిజీ
✔NRPT:రోడ్డు ప్రమాదం.. ఓ మహిళ మృతి
✔రేపటి నుంచి అన్ని గ్రామాల్లో గ్రామసభలు
✔ముమ్మరంగా రైతు భరోసా సర్వే
✔అర్హులందరికీ సంక్షేమ పథకాలు: అడిషనల్ కలెక్టర్లు
✔ప్రజావాణి.. సమస్యలపై ఫోకస్
✔సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి:SIలు

Similar News

News February 12, 2025

MBNR: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

image

లక్ష్మీనారాయణ కంపౌండ్‌లో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నిన్న చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. జడ్చర్ల మండలం జయప్రకాశ్‌నగర్‌కు చెందిన శంకర్(33) ఇంటి నుంచి మేస్త్రీ పనికోసం బయలుదేరాడు. ఎప్పుడు.. ఎలా.. ఏం జరిగిందో తెలియదుకాని కాంపౌండ్ వద్ద రోడ్డుపై పడి మృతిచెందాడు. మృతుడికి మూర్ఛ వచ్చేదని, మద్యం తాగే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. శంకర్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కేసు నమోదైంది.

News February 12, 2025

MBNR: చనిపోయేందుకు శ్రీశైలం వచ్చిన యువతి.. కాపాడిన పోలీసులు

image

ఆత్మహత్య చేసుకునేందుకు శ్రీశైలం వచ్చిన ఓ యువతిని స్థానిక పోలీసులు కాపాడారు. సీఐ ప్రసాదరావు వివరాల మేరకు.. వనపర్తి జిల్లా ఓ గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకునేందుకు శ్రీశైలం వచ్చింది. పాతాళగంగ వద్ద తిరుగుతున్న ఆమెను పోలీస్ సిబ్బంది గుర్తించి వివరాలు తెలుసుకున్నారు. వారి బంధువులకు క్షేమంగా అప్పగించామని సీఐ తెలిపారు. ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో తెలియరాలేదని ఆయన పేర్కొన్నారు.

News February 12, 2025

MBNR: టెన్త్ అర్హతతో 44 ఉద్యోగాలు

image

మహబూబ్‌నగర్ డివిజన్‌‌లో 20, వనపర్తి డివిజన్‌లో 24 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

error: Content is protected !!