News January 29, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

✔Way2Newsతో SBI, SBRSETI డైరెక్టర్
✔ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ డీకే అరుణ
✔FBR 7నుంచి మన్నెంకొండ బ్రహ్మోత్సవాలు
✔తగ్గిన చలి.. పెరిగిన ఉష్ణోగ్రతలు
✔సీఎం,MLAల చిత్రపటానికి పాలాభిషేకం
✔UPS విధానానికి వ్యతిరేకంగా ఉద్యోగుల నిరసన
✔మరికల్:వేధింపుల కేసులో వ్యక్తికి జైలు శిక్ష
✔మక్తల్: క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే
✔దామరగిద్ద: అనుమానాస్పద స్థితిలో..చిరుత మృతి
Similar News
News October 28, 2025
MBNR: మొక్కజొన్న కొనుగోలు కేంద్రం పరిశీలన

వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి మంగళవారం సందర్శించారు. మొక్కలు ఎండబెట్టుకుని శుభ్రంగా తీసుకొస్తే ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందని సూచించారు. పత్తి రైతులతో మాట్లాడుతూ.. స్లాట్ బుకింగ్ చేసుకుని వస్తే సీసీఐ పత్తి కొనుగోలు చేసిందన్నారు. తుపాన్ కారణంగా రేపు ఎల్లుండి వర్షం పడే అవకాశం ఉన్నందున రైతులు జాగ్రత్తగా తీసుకోవాలన్నారు.
News October 28, 2025
కురుమూర్తి ఉద్దాల ఉత్సవంలో జేబుదొంగల చేతివాటం

వడ్డేమాన్ ఉద్దాల మండపం వద్ద కురుమూర్తి స్వామి జాతర ఉత్సవాల సందర్భంగా జేబుదొంగలు చేతివాటం ప్రదర్శించారు. లాలకోటకు చెందిన నర్సింహులు జేబులో ఉన్న దాదాపు రూ.10 వేలను దొంగిలించారు. వందలాది పోలీసులు భద్రతలో ఉన్నప్పటికీ, జేబుదొంగలు తమ పనిని కొనసాగించడం విశేషం. కాగా జాతర మైదానంలో ఏటా ఇలాంటి ఘటనలు సర్వ సాధారణంగా మారిపోయాయి. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
News October 28, 2025
MBNR: అక్కడే అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్ నగర్ జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్లో 15.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. మిడ్జిల్ మండలం దోనూరు 5.8, బాలానగర్ 5.5, రాజాపూర్ 4.0, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 3.5, నవాబుపేట 3.0, మహబూబ్ నగర్ గ్రామీణం, మహమ్మదాబాద్ 2.5, కోయిలకొండ మండలం పారుపల్లి 2.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.


