News March 4, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

✔రెండవ రోజు ముగిసిన రంజాన్ ఉపవాసం
✔సహార్: రేపు(మంగళవారం)-5:12
✔ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల డ్రంక్& డ్రైవ్
✔పెండింగ్ చలాన్లు చెల్లించండి: ఎస్సైలు
✔లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి:SPలు
✔ప్రజావాణి.. సమస్యలపై ఫోకస్
✔రేపు చలోమాల- చలో అలంపూర్
✔ఇంటర్మీడియట్ పరీక్షలపై ప్రత్యేకంగా నిఘా
✔పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యేలు
✔వీజీ ట్రోఫీకి ఎంపికైన పీయూ క్రీడాకారుడు
Similar News
News March 24, 2025
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో నేటి పంట ఉత్పత్తుల ధరలు…!

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు సోమవారం127 మంది రైతులు తమ పంట ఉత్పత్తులు అమ్మకానికి తీసుకొచ్చారు. వేరుశనగలు 702 క్వింటాళ్లు అమ్మకానికి రాగా క్వింటాలకు గరిష్ఠ ధర రూ.6,740 కనిష్ఠ ధర రూ.4,001 లభించింది. మొక్కజొన్న క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.2,280, కనిష్ఠ ధర రూ.1767 లభించింది. కందులు గరిష్ఠ ధర రూ.6,771. ఆముదాలకు గరిష్ట ధర రూ.6,319. జొన్నలకు గరిష్ట ధర రూ.4,215 లభించినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.
News March 24, 2025
MBNR: పంట నష్ట నివేదికలని వెంటనే సమర్పించాలి: కలెక్టర్

గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వడగళ్ల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల నష్టపరిహార నివేదికలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం తన ఛాంబర్‌లో పంట నష్ట అంచనాపై అధికారులతో సమీక్షించారు. అకాల వర్షాల కారణంగా మహబూబ్ నగర్ రూరల్, హన్వాడ, మూసాపేట్, భూత్పూర్ మండలాలల్లో పంటలు నష్టపోయాయని వెంటనే వారికి సంబంధించిన నష్టపరిహార నివేదికనుసిద్ధం చేయాలన్నారు.
News March 24, 2025
MBNR: ఫిర్యాదుల్ని తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

ఈ వారం ప్రజావాణికొచ్చిన 125 ఫిర్యాదుల్ని తక్షణమే పరిష్కరించి తనకు నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను హెచ్చరించారు. సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ అనంతరం అధికారులతో పెండింగ్ ఫిర్యాదులపై సమీక్షించారు. ఏ వారం ఫిర్యాదుల్ని ఆ వారమే పరిష్కరించాలని చెబుతున్నా నిర్లక్ష్యం వహిస్తారా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా వెంటనే పరిష్కరించి తనకు నివేదించాలన్నారు.