News March 14, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

✔ఘనంగా ‘ల్యాబ్ టెక్నీషియన్ డే’
✔రేపే హోలీ..ఊపందుకున్న రంగుల కొనుగోళ్ళు
✔ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా కవయిత్రి మొల్ల జయంతి
✔వనపర్తి: కీచక ఉపాధ్యాయులపై సస్పెన్షన్
✔GWL:విద్యారంగానికి నిధులు కేటాయించాలి:BRSV
✔ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలి:ఎస్పీలు
✔ఉమ్మడి జిల్లాలో దంచికొడుతున్న ఎండలు
✔SLBC దుర్వాసన వస్తున్నా… అంతు చిక్కడం లేదు
✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
Similar News
News March 24, 2025
కొడంగల్: విషాదం.. యువకుడి మృతి!

యువకుడు ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన కొడంగల్ పరిధి మద్దూరులో జరిగింది. ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాలు.. మండలంలోని గోకుల్ నగర్ వాసి సాయిలు(21) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయంపై తండ్రి మందలించాడని ఈనెల 17న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబీకులు చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడని మద్దూర్ ఎస్ఐ తెలిపారు.
News March 24, 2025
MBNR: 24న ఆశావర్కర్స్ ‘చలో హైదరాబాద్’

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆశా కార్యకర్తలు CITU ఆధ్వర్యంలో తమ సమస్యలపై గళమెత్తారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కురుమూర్తి మాట్లాడుతూ.. కార్మికులకు రూ.18 వేతనం, పీఎఫ్, ఈపీఎఫ్, గ్రాటివిటీ, పెన్షన్ ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆశాకార్యకర్తలు వచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.
News March 24, 2025
MBNR: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో గద్వాలలో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిపై అనర్హత వేటు పడుతుందా.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. గద్వాలలో ఉప ఎన్నికలు జరుగుతాయా అని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?