News April 1, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి TOP NEWS!

image

✔ఘనంగా రంజాన్ వేడుకలు✔రంజాన్ EFFECT.. ఈద్గాల వద్ద భారీ బందోబస్తు✔నర్వలో పేకాట రాయులు అరెస్ట్✔ఈద్గా వద్ద నాయకుల సందడి✔MBNR:వడగండ్ల వాన..ఆరెంజ్ అలెర్ట్ జారీ✔బిజినేపల్లి: ఏప్రిల్ 9న పూలే విగ్రహావిష్కరణ✔రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు,ఎస్పీలు✔NRPT:BRSలో చేరిన కాంగ్రెస్ నేతలు✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్✔జడ్చర్లలో వృక్షాలపై గొడ్డలి వేటు

Similar News

News April 6, 2025

హె‌చ్‌సీయూ రక్షణకు చేతులు కలపండి: కేటీఆర్

image

TG: HCU భూముల వివాదంపై ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులకు KTR బహిరంగ లేఖ రాశారు. కంచ గచ్చిబౌలి, HCU రక్షణకు చేతులు కలపాలని పిలుపునిచ్చారు. 400 ఎకరాల భూమి ప్రమాదంలో పడిందని, ఆర్థిక లాభం కోసం ప్రభుత్వం పర్యావరణంపై దాడి చేస్తోందని పేర్కొన్నారు. తప్పుడు సమాచారంతో ఉద్యమాన్ని తప్పుదారి పట్టిస్తోందని మండిపడ్డారు. ఆ భూముల్లో 734 రకాల మొక్కలు, 220 రకాల పక్షులు, 15 రకాల జంతువులు ఉన్నాయన్నారు.

News April 6, 2025

మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు అరెస్ట్

image

AP: మాజీ Dy.CM అంజద్ బాషా సోదరుడు అహ్మద్‌ అరెస్టయ్యారు. ఆయనపై లుక్ అవుట్ నోటీసులు ఉండటంతో ముంబై ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని కడప పోలీసులకు అప్పగించారు. TDP MLA మాధవీరెడ్డిని దూషించారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఓ స్థలం విషయంలోనూ దాడి కేసు ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో ఇరువర్గాలు రాజీ పడినప్పటికీ కక్ష సాధింపులో భాగంగా అరెస్టు చేసినట్లు YCP వర్గాలు ఆరోపిస్తున్నాయి.

News April 6, 2025

స్టాలిన్ వ్యాఖ్యలకు ప్రధాని కౌంటర్

image

తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చాక తమిళనాడుకు 300% అధికంగా నిధులు ఇచ్చామని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో రూ.8,300 కోట్ల విలువైన జాతీయ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. కేంద్రం తమ రాష్ట్రానికి నిధులు కేటాయించలేదన్న సీఎం స్టాలిన్ వ్యాఖ్యలకు ప్రధాని కౌంటర్ ఇచ్చారు. రైల్వే బడ్జెట్‌లో 700శాతం అధికంగా నిధులు కేటాయించామన్నారు. మరోవైపు మోదీ కార్యక్రమాన్ని ఎంకే స్టాలిన్ బహిష్కరించారు.

error: Content is protected !!