News April 5, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి.. TOP NEWS!!

image

❤ముస్లిం మహిళల మేలు కోసమే వక్ఫ్ బోర్డు:ఎంపీ డీకే అరుణ❤పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్❤విద్యార్థుల వెతలు వర్ణనాతీతం:RSP❤”CM రేవంత్ రెడ్డిను కలిసిన పీయూ CV”❤పలుచోట్ల సన్న బియ్యం పంపిణీ❤గండీడ్:GOVT ఉద్యోగాలు సాధించిన వారికి ఘన సన్మానం❤వనపర్తి: రేవల్లిలో నీటి కష్టాలు❤’Way2News’తో గురుకులలో సీట్లు సాధించిన విద్యార్థులు❤IPL బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు:ఎస్సైలు

Similar News

News October 24, 2025

HNK: ఈనెల 27 నుంచి ఎస్‌జీఎఫ్ పోటీలు

image

హనుమకొండ జేఎన్ఎస్‌లో ఈనెల 27 నుంచి 30 వరకు ఉమ్మడి జిల్లా స్థాయి అండర్-19 క్రీడా ఎంపిక పోటీలు జరగనున్నట్లు జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ తెలిపారు. కరాటే, యోగా, బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్, చెస్, బ్యాడ్మింటన్, ఖోఖో, బాక్సింగ్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్, క్రికెట్, షూటింగ్ వంటి పలు క్రీడల్లో బాలబాలికలు పాల్గొంటారన్నారు. ఎంపికైన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని పేర్కొన్నారు.

News October 24, 2025

వాడపల్లికి రూ.6 కోట్లు మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

image

వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి 216వ నంబర్ జాతీయ రహదారి నుంచి గోదావరి గట్టు మీదుగా నేరుగా చేరుకునేందుకు వీలుగా నూతన రహదారి నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు పంచాయతీరాజ్ నిధుల నుంచి రూ.6 కోట్లు మంజూరు చేశారు. గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేసిన విజ్ఞప్తికి పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు.

News October 24, 2025

HYD: మూసీ వారధి ఇక సెలవంటోంది! ❣

image

హైదరాబాదీతో ఆ బంధం తెగుతోంది. 40 ఏళ్లు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేర్చిన మూసారాంబాగ్ పాత బ్రిడ్జి కూల్చివేతతో ప్రజలు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఉన్నప్పుడు తెలియదేమో కానీ.. కొత్త బ్రిడ్జి నిర్మాణం మొదలైనప్పటి నుంచి వాహనదారులకు ఆ కష్టాలు తెలుసు. ఊరంతా తిరిగివెళ్లాల్సిందే. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో పాతబ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. బాగు చేసే అవకాశం కూడా లేక బల్దియా <<18080133>>కూల్చివేతలు<<>> చేపట్టింది.