News April 9, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!

✔వక్స్ బిల్లు.. ముస్లింల భారీ నిరసన ర్యాలీ✔గద్వాలలో గుర్తుతెలియని మృగం కలకలం✔ప్రతి గింజను కొనుగోలు చేయండి: కలెక్టర్లు✔సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ✔వచ్చే విద్యా సంవత్సరానికి ఏకరూప దుస్తులు సిద్ధం: డీఈవోలు✔గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి: CPM✔PUలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ✔పలుచోట్ల చలివేంద్రాలు ప్రారంభం✔వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం✔SLBCలో ముమ్మరంగా మట్టి, స్టీల్ తొలగింపు.
Similar News
News February 26, 2026
ఖమ్మం: రేషన్ అక్రమాలపై విజిలెన్స్ నిఘా

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా పౌరసరఫరాల శాఖ నిఘా పెంచింది. నెలకు రెండుసార్లు గోదాములు, దుకాణాల్లో తనిఖీలు చేయనున్నారు. బియ్యం దళారులకు విక్రయించే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు డీలర్ షిప్ రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం అందేలా పకడ్బందీ కార్యాచరణ రూపొందిస్తున్నామని, అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
News February 26, 2026
తిరుపతి స్విమ్స్‌లో ఉద్యోగాలు

తిరుపతి స్విమ్స్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు మార్చి 3 నుంచి 6వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. మెడికల్ ఆఫీసర్లు-4, స్టాఫ్ నర్సులు-4, ఏఎన్ఎం-4, మమోగ్రఫీ టెక్నీషియన్-2, కార్డియో వాస్క్యలర్ టెక్నీషియన్ గ్రేడ్-2, డీఏవో-2, పీఆర్వో-2, మెడికో సోషల్ వర్కర్-2, ఎలక్ట్రీషియన్62, డ్రైవర్లు-2 పోస్టులు ఉన్నాయి. svimstpt.ap.nic.in వెబ్సైట్ చూడాలి. ఈనెల 19 నుంచే ఇంటర్వ్యూలు జరగాల్సి ఉండగా వాయిదా పడ్డాయి.
News February 26, 2026
గచ్చిబౌలి: మనూలో దరఖాస్తుల ఆహ్వానం

గచ్చిబౌలిలోని మనూలో బీఏ, బీఈడీ, బీఎస్సీ బీఈడీ, బీకామ్ బీఈడీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎన్సీఈటీ)లో వచ్చిన స్కోర్ల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తామని మనూ అడ్మిషన్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ ప్రొ.వనజ తెలిపారు. ఆసక్తిగలవారు మార్చి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.


