News April 6, 2024
ఉమ్మడి జిల్లాలో నేడు బీఆర్ఎస్ నిరసనలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం 10 నుంచి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమానికి అధిష్ఠానం పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఉమ్మడి జిల్లాలోని అయా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
Similar News
News December 12, 2025
MBNR జిల్లాలో FINAL పోలింగ్ శాతం

MBNR జిల్లాలో 139 గ్రామ పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 83.04 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.
News December 12, 2025
మహబూబ్‌నగర్ జిల్లాలో నేటి ముఖ్యంశాలు

MBNR: గెలుపొందిన అభ్యర్థులకు డీజు సౌండ్‌తో ర్యాలీకి అనుమతి లేదు: ఎస్పీ డి.జానకి
@ప్రశాంతంగా ముగిసిన మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు.
@రాజపూర్ మండలం రంగారెడ్డిగూడ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కాటేపాగ రేవతి 31 ఓట్లతో గెలుపు.
@నవాబుపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపు.
@రాజాపూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కావలి రామకృష్ణ 1104 భారీ మెజార్టీతో గెలుపు.
News December 11, 2025
రాజాపూర్: మెజార్టీ పెంచిన రీ కౌంటింగ్

ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సొంతూరు రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడెంలో బీజేపీ గెలుపొందింది. మొదట కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అంజలిపై 6ఓట్లతో బీజేపీ బలపర్చిన అభ్యర్థి కాటేపాగ రేవతి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు రీ కౌంటింగ్ కోరడంతో నిర్వహించిన రీకౌంటింగ్‌లో రేవతికి 36ఓట్ల మెజార్టీ లభించినట్లు అధికారులు ప్రకటించారు.దీంతో విషయం ఉమ్మడి పాలమూరు జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశమైంది.


